టాక్సీ ఫర్ షూర్ నుంచి మోస్ట్ ఆసమ్ జాబ్ క్యాంపైన్..

By Ravi

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ టాక్సీ ఫర్ షూర్ 'మోస్ట్ ఆసమ్ జాబ్' పేరిట ఓ ప్రత్యేక క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, జీవితకాలం పాటు జాబ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం నైపుణ్యం కలిగిన యువ ప్రొఫెషనల్స్‌ను గుర్తించడమే. ఇందులో వ్యక్తుల విద్య, వారి ప్రస్తుత వృత్తితో సంబంధం లేదు. బెంగుళూరుకు చెందిన కంపెనీ ఈ క్యాంపైన్‌ను జూన్ 2, 2014న ప్రారంభించింది.

ఈ మోస్ట్ ఆసమ్ జాబ్‌లో భాగంగా.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి ఆయా కంపెనీలు ఆఫర్ చేస్తున్న సేవల కన్నా టాక్సీ ఫర్ షూర్ ఆఫర్ చేసే సేవలే మెరుగ్గా ఉంటాయనే భరోసా కల్పించనున్నారు. ఈ క్యాంపైన్‌ను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో పాల్గొనదలిచే అభ్యర్థులు http://bit.ly/MostAwesomeJob ఈ లింక్‌పై క్లిక్ చేసి తమ క్రైటీరియాను చెక్ చేసుకోవచ్చు.

Most Awesome Job Campaign

ఈ క్యాంపైన్ గురించి టాక్సీ ఫర్ షూర్ సహవ్యవస్థాపకులు, డైరెక్టర్ అప్రమేయ రాధాక్రిష్ణ వివరిస్తూ.. నైపుణ్యం కలిగిన యువ అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఇదొక సువర్ణావకాశం అని, తాము శరవేగంగా వృద్ధి చెందుతున్నామని, ఈ వేగం మరియు వృద్ధితో పాటుగా పనిచేసే వ్యక్తుల కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు.

తమ ఆలోచనలు కార్యరూపంలో పెట్టడమే అత్యంత గొప్ప విషయమని, టాక్సీ ఫర్ షూర్‌లో అలాంటి వారికి అవకాశాలు కోకొళ్లలుగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వారి కోసమే తమ అన్వేషణని తెలిపారు. మరి మీరు కూడా జాబ్ మారాలనుకుంటే లేదా మీ లక్ ట్రై చేయాలనుకుంటే, ఈ మోస్ట్ ఆసమ్ జాబ్ కాంటెస్ట్‌లో పాల్గొనండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2014, 14:25 [IST]
English summary
Taxi For Sure has launched its new campaign called the 'Most Awesome Job'. The motive of its campaign is to find creative and young professionals for the job experience of a lifetime. The individual's education and current profession do not matter. The Bangalore based company began its campaign on 2nd June, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+