టాటా నానో టాక్సీ సేవలను ప్రారంభించిన టాక్సీ ఫర్ షూర్

ప్రముఖ టాక్సీ అండ్ కార్ రెంటల్స్ కంపెనీ 'టాక్సీ ఫర్ షూర్' (TaxiForSure) బెంగుళూరులో టాటా నానో టాక్సీ సేవలను ప్రారంభించింది. అత్యంత సరసమైన ధరకే, టాక్సీ సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ నానో టాక్సీ సేవలను ప్రవేశపెట్టింది.

బెంగుళూరు నగరంలో దాదాపు 100 నానో టాక్సీలతో ఈ సేవలు ప్రారంభించారు. రానున్న వారాల్లో మరిన్ని నగరాలకు టాటా నానో టాక్సీ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. టాక్సీ ఫర్ షూర్ సహ-వ్యవస్థాపకులు రఘునందన్ జి, అప్రమేయ ఆర్‌లు నగరంలో తమ కంపెనీ బ్రాండింగ్‌తో కూడిన నానో టాక్సీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

Nano Taxi

టాక్సీ ఫర్ షూర్ మొబైల్ అప్లికేషన్ మరియు మొబైల్ సైట్‌లో 'పిక్ నౌ' ఆప్షన్ ద్వారా నానో సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. టాటా నానో టాక్సీలో మొదటి రెండు కిలోమీటర్లకు రూ.25 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.10 చొప్పున చార్జ్ చేస్తారు. రెగ్యులర్ ఆటోరిక్షాలతో పోల్చుకుంటే, ఈ చార్జీలు ఎంతో బెటర్ అనిపిస్తాయి. అంతేకాకుండా, ఆటోరిక్షాలలో కన్నా టాటా నానో టాక్సీలలో ప్రయాణం ఎంతో సురక్షితంగా ఉంటుంది.

టాటా నానో విషయానికి వస్తే.. ఇందులో 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2014, 12:37 [IST]
English summary
TaxiForSure, India’s leading aggregator of taxi and car rentals, formally launched their new category of Nano taxis in the city today. The move could be seen as a unique one in the Indian transportation industry so far, making in-city taxi travel even more convenient and affordable.
 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+