ఒకే కస్టమర్ నుంచి 100 టెస్లా మోడల్ ఎస్ కన్వర్టిబల్ కార్లకు ఆర్డర్!
ఈరోజుల్లో ఒకే వ్యక్తి వద్ద నాలుగైదు కార్లు ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఒకే వ్యక్తి వద్ద 100 కార్లు ఉంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే. చైనాకు చెందిన ఓ పెట్టుబడిదారుడు (పేరు చెప్పడానికి నిరాకరించిన వ్యక్తి) ఏకంగా 100 టెస్లా మోడల్ ఎస్ కన్వర్టిబల్ కార్లు కావాలని టెస్లా మోటార్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: ఇండియాకు రానున్న టెస్లా మోడల్ ఎస్ కారు
టెస్లా మోటార్స్ అందిస్తున్న మోడల్ ఎస్ ఓ ఎలక్ట్రిక్ కారు. అంతేకాదు, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ స్పోర్ట్ కారు కూడాను. ప్రస్తుతం టెస్లా మోడల్ ఎస్ కన్వర్టిబల్ రూపంలో లభ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత కూపే వెర్షన్ మోడల్ ఎస్ రూఫ్‌ను మోడిఫై చేసేందుకు న్యూపోర్ట్ కన్వర్టిబల్ ఇంజనీరింగ్ అనే రూఫ్ మోడిఫికేషన్ కంపెనీ ముందుకు వచ్చింది.

న్యూపోర్ట్ కన్వర్టిబల్ ఇంజనీరింగ్ కంపెనీ టెస్లా మోటార్స్‌తో కలిసి ఈ ఆర్డర్‌ను ప్రత్యేకంగా డీల్ చేయనుంది. న్యూపోర్ట్ కన్వర్టిబల్ ఇంజనీరింగ్ కంపెనీకి కాడివాక్ ఈఎల్ఆర్, నిస్సాన్ జిటి-ఆర్ వంటి కార్లను రూఫ్‌ను కన్వర్ట్ చేసిన అనుభవం ఉంది. ఈ కన్వర్టిబల్ టెస్సా మోడల్ ఎస్ కార్లను బార్సిలోనో, కాలిఫోర్నియా, దుబాయ్ దేశాల్లో విక్రయించనున్నారు.
మోడల్ ఎస్ కన్వర్టిబల్ కార్లకు మంచి డిమాండ్ ఉండగలదని సదరు చైనీస్ పెట్టుబడిదారుడు యోచిస్తున్నారు. సాధారణంగా, రెగ్యులర్ టెస్లా మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కార్లే అధిక ధరను కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కన్వర్టిబల్ వెర్షన్ మోడల్ ఎస్ కోసం సదరు చైనీస్ ఇన్వెస్టర్ మరింత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








