650 కిలోమీటర్ల రేంజ్‌తో అప్‌గ్రేడ్ కానున్న టెస్లా రోడ్‌స్టర్
కాలిఫోర్నియాకి చెందిన టెస్లా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ తొలిసారిగా 2008లో విడుదల చేసిన టెస్లా రోడ్‌స్టర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ కారును, అప్‌గ్రేడ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హైవేపై వినియోగించదగిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కార్ అయిన టెస్లా రోడ్‌స్టర్ రేంజ్‌ను మరింత పెంచే దిశగా టెస్లా మోటార్స్ అడుగులు వేస్తోంది.
ప్రస్తుత టెస్లా రోడ్‌స్టర్‌తో పోల్చుకుంటే రెండింతలు ఎక్కవ రేంజ్‌ను ఆఫర్ చేసేలా కంపెనీ ఓ కొత్త ప్రోటోటైప్‌ను ప్లాన్ చేస్తోంది. లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ ఆగకుండా దూసుకుపోయేలా 400 మొళ్ల రేంజ్ (643 కి.మీ)ను ఆఫర్ చేసే టెస్లా రోడ్‌స్టర్ 3.0 ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేస్తున్నామని కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు.
కొత్త టెస్లా రోడ్‌స్టర్ 3.0 ప్రోటోటైప్ మెరుగైన బ్యాటరీ లైఫ్, కొత్త ఏరోడైనమిక్ కిట్ మరియు వీల్ అప్‌గ్రేడ్‌తో రూపుదిద్దుకుంటుందని, ఒరిజినల్ రోడ్‌స్టర్‌తో పోల్చుకుంటే దీని రేంజ్ 40-50 శాతం పెరుగుతుందని టెస్లా పేర్కొంది.

కొత్త 70 కిలోవాట్ అవుట్‌పుట్ బ్యాటరీ వలన రేంజ్ 31 శాతం పెరుగుతుంది. అలాగే, కొత్త రెట్రోఫిట్ ఏరో కిట్ వలన డ్రాగ్ 15 తగ్గుతుంది మరియు కొత్త టైర్లు, అప్‌గ్రేడెడ్ బేరింగ్స్ వలన రోలింగ్ సామర్థ్యం 20 శాతం మెరుగు పడుతుందని కంపెనీ వివరించింది.
వచ్చే ఏడాది ఆరంభం నుంచి టెస్లా రోడ్‌స్టర్ 3.0 ప్రోటోటైప్‌ను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ రూట్‌లో నాన్-స్టాప్ టెస్ట్ డ్రైవ్ చేసి, తమ ఇంప్రూవ్‌మెంట్స్‌ని డెమోనిస్ట్రేట్ చేయనున్నామని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెస్లా రోడ్‌స్టర్ లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు పూర్తి చార్జ్‌పై 200 మైళ్ల (320 కిలోమీటర్ల) దూరం వెళ్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








