టెస్లా మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో రెండు కొత్త ఫీచర్స్
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అందిస్తున్న పాపులర్ సెడాన్ 'మోడల్ ఎస్' (Model S) కోసం కంపెనీ రెండు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. టెస్లా మోడల్ ఎస్ ఇప్పుడు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తోను, అటానమస్ డ్రైవింగ్ ఫెసిలిటీతోను లభిస్తుందని కంపెనీ పేర్కొంది. టెస్లా మోడల్ ఎస్ ఇప్పటివరకూ రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమయ్యేది.
కాగా.. కొత్త టెస్లా మోడల్ ఎస్‌లో ముందు చక్రాలకు కూడా మోటార్లు అమర్చామని, అంతేకాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రైవర్ ప్రమేయం లేకుండా కూడా కారును ఆటోమేటిక్‌గా నియంత్రించేలా ఇందులో సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచామని టెస్లా మోటార్స్ తెలిపింది. రాడర్, సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్, జిపిఎస్, రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా తదితర అంశాలను ఆసరగా చేసుకొని, డ్రైవర్ సాయం లేకుండానే ఈ కారును యాంత్రికంగా కంట్రోల్ చేయవచ్చు. ఇదొక సెమీ అటానమస్ ఎలక్ట్రిక్ కారు.

కాగా.. అమెరికా, యూరప్ మార్కెట్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్న టెస్లా మోటార్స్ చైనా, భారత్‌లలో కూడా కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. గతంలో టెస్లా మోటార్స్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ అహుజా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఇండియన్ ఎంట్రీ ప్లాన్స్ గురించి వెల్లడించారు. టెస్లాకు భారత్‌లో మంచి డిమాండ్ లభించగలదని, ఇక్కడి మార్కెట్లో ప్రవేశించేందుకు 2015 సంవత్సరం చాలా ఉత్తమమైనదని ఆహుజా ధీమా వ్యక్తం చేశారు.
టెస్లా మోడల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ మూడు విభిన్న బ్యాటరీ పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో (60 కి.వా., 85 కి.వా., పెర్ఫార్మెన్స్ వెర్షన్ పి85) లభిస్తోంది. అవి -
టెస్లా మోడల్ ఎస్ 60 కి.వా. వేరియంట్ 302 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 193 కి.మీ. మరియు దీని రేంజ్ 334 కి.మీ.

టెస్లా మోడల్ ఎస్ 85 కి.వా. వేరియంట్ 362 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 201 కి.మీ. మరియు దీని రేంజ్ 426 కి.మీ.
టెస్లా మోడల్ ఎస్ 85 కి.వా. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 416 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 209 కీ.మీ. మరియు దీని రేంజ్ 426 కి.మీ.


Click it and Unblock the Notifications








