థర్డ్ జనరేషన్ స్కొడా సూపర్బ్ అఫీషియల్ స్కెచెస్

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ మేకర్ స్కొడా నిలిపివేసిన సూపర్బ్ మోడల్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు స్కొడా తమ నెక్స్ట్ జనరేషన్ సూపర్బ్ మోడల్‌కి సంబంధించిన అఫీషియల్ స్కెచ్‌లను విడుదల చేసింది.

వచ్చే ఏడాది జరగబోయే జెనీవా మోటార్ షోలో స్కొడా తమ థర్డ్ జనరేషన్ సూపర్బ్ సెడాన్‌ను అధికారికంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ మార్కెట్లో గట్టి పట్టు సాధించేందుకు స్కొడా తమ సరికొత్త సూపర్బ్‌ను మరింత విశాలంగా, విలాసవంతంగా తీర్చిదిద్దనుంది.

Skoda Superb Front

ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కొత్త స్కొడా సూపర్బ్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కొత్త పస్సాట్, ఆక్టావియా, గోల్ఫ్ వంటి మోడళ్లను కూడా తయారు చేస్తున్నారు.

స్కొడా విజన్ సి కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది కొత్త సూపర్బ్‌ను తయారు చేయనున్నారు. ప్రస్తుత తరం సూపర్బ్‌తో పోల్చుకుంటే కొత్త స్కొడా సూపర్బ్ 20 మి.మీ. ఎక్కువ పొడవును, 50 మి.మీ ఎక్కువ వెడల్పును కలిగి ఉండి, 75 కేజీల తక్కువ బరువును కలిగి ఉండనుంది.

Skoda Superb Rear

స్కొడా సూపర్బ్ కారులో 170 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ప్రస్తుత వెర్షన్‌లో ఉపయోగిస్తున్న డిఎస్‌జి గేర్‌బాక్స్‌లనే కొత్త మోడల్‌లోను ఉపయోగించనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి సరికొత్త స్కొడా సూపర్బ్ ఇండియన్ మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, December 24, 2014, 12:08 [IST]
English summary
Check-republic carmaker Skoda has released the first official sketchs of its all-new Superb sedan. Skoda also confirmed that the vehicle will debut in Prague in the middle of February 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+