మారుతి సుజుకికి చెక్ పెట్టేందుకు టొయోటా-దైహస్తు స్మాల్ కార్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న కార్లదే హవా. ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్నది మారుతి సుజుకి ఇండియా. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్-5 స్మాల్ కార్లలో కనీసం మొదటి 3-4 నాలుగు మోడళ్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే ఉంటాయి.

కొత్తగా వచ్చిన కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు, త్వరపడండి!

ఈ సెగ్మెంట్లోకి అనేక విదేశీయ కంపెనీలు ప్రవేశించినప్పటికీ, వాటిలో ఏవీ కూడా మారుతి సుజుకికి గట్టి పోటీని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో, జపాన్‌కు చెందిన టొయోటా భారత మార్కెట్ కోసం తక్కువ ధర కలిగిన చిన్న కార్లను ప్రవేశపెట్టి మారుతికి పోటీగా నిలవాలని యోచిస్తోంది.


టొయోటా ఇందు కోసం దైహస్తుతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఓ చిన్న కారును అభివృద్ధి చేసేందుకు టొయోటా-దైహస్తు సంస్థలు కలిసి పనిచేయనున్నారు. ఈ చిన్న కారును దైహస్తు కంపెనీ స్వయంగా ఇంజనీరింగ్ చేసి, భారతదేశంలో విస్తృతంగా ఉన్న టొయోటా నెట్‌వర్క్ ద్వారా, టొయోటా బ్యాడ్జింగ్‌తో ఈ చిన్న కారును విక్రయించాలని సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం టొయోటా భారత మార్కెట్లో ఎతియోస్ లివా, ఎతియోస్ క్రాస్, ఎతియోస్, కరోలా ఆల్టిస్, క్యామ్రీ, ప్రియస్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ క్రూజర్ ప్రాడో వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో టొయోటాకు సరైన మోడల్ ఏదీ లేదు. కంపెనీ విక్రయిస్తున్న ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ అధిక ధర కారణంగా ఇది అంతంత మాత్రంగానే అమ్ముడుపోతోంది.

Toyota

భారత్‌లో స్థానికంగా లభించే విడిభాగాలను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించి, సరసమైన ధరకే టొయోటా కోసం ఓ చిన్న కారును తయారు చేయాలని దైహస్తు భావిస్తోంది. అయితే, తక్కువ ధరకే ఈ చిన్న కారును ఆఫర్ చేస్తే, దీని నాణ్యత విషయంలో ప్రజలకు సందేహం వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ టొయోటా-దైహస్తు స్మాల్ కార్ డాట్సన్ గో మాదిరిగా సేఫ్టీలో ఫెయిల్ అవుతుందో లేక పాస్ అవుతుందో తెలియాలంటే, మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2014, 10:15 [IST]
English summary
Toyota has decided its time to compete head on with its Japanese competitors in India. They are working together with Daihatsu on developing a small car vehicle. Daihatsu is most likely to engineer the small car by themselves and will receive Toyota badging, so it can be sold in their wide India network.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+