మారుతి ఆల్టో కె10 కారుకి పోటీగా రానున్న టొయోటా ఆయ్గో

By Ravi

ఎంట్రీ లెవల్ ప్యాసింజ్ కార్ల విభాగంలో భారత అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియాకు గట్టి పోటీని ఇచ్చేందుకు జపాన్‌కు చెందిన టొయోటా ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

ఇందు కోసం దైహస్తుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టొయోటా, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ పాపులర్ స్మాల్ కార్ టొయోటా ఆయ్గో (Toyota Aygo)ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ మార్కెట్లలో టొయోటా ఆయ్గో స్మాల్ కార్‌కు మంచి క్రేజ్ ఉంది. అక్కడి మార్కెట్లో ఇది అధిక ఫీచర్లతో లభిస్తోంది.


టొయోటా-దైహస్తు జేవీ ఆయ్గో ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని, యూరోపియన్ వెర్షన్‌లోని కొన్ని ఫీచర్లను తొలగించి, ఇండియన్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టొయాటా తయారు చేస్తున్న ఆయ్గో కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని, 95 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోను మరియు ఏఎమ్‌టి గేర్ బాక్స్ ఆప్షన్‌తోను లభిస్తోంది.


టొయోటా ఆయ్గో భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి ఆల్టో కె10, హ్యుందాయ్ ఇయాన్ 1.0 లీటర్ వంటి మోడళ్లలతో పోటీ పడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం టొయోటా భారత మార్కెట్లో ఎతియోస్ లివా, ఎతియోస్ క్రాస్, ఎతియోస్, కరోలా ఆల్టిస్, క్యామ్రీ, ప్రియస్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ క్రూజర్ ప్రాడో వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో టొయోటాకు సరైన మోడల్ ఏదీ లేదు. కంపెనీ విక్రయిస్తున్న ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ అధిక ధర కారణంగా ఇది అంతంత మాత్రంగానే అమ్ముడుపోతోంది.

Toyota Aygo 3

భారత్‌లో స్థానికంగా లభించే విడిభాగాలను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించి, సరసమైన ధరకే ఓ చిన్న కారును తయారు చేయాలని టొయోటా-దైహస్తు భావిస్తోంది. అయితే, తక్కువ ధరకే ఈ చిన్న కారును ఆఫర్ చేస్తే, దీని నాణ్యత విషయంలో ప్రజలకు సందేహం వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ టొయోటా-దైహస్తు స్మాల్ కార్ డాట్సన్ గో మాదిరిగా సేఫ్టీలో ఫెయిల్ అవుతుందో లేక పాస్ అవుతుందో తెలియాలంటే, మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, November 12, 2014, 13:32 [IST]
English summary
Toyota offers its Aygo model in European countries and is their small car offering. The Euro-spec hatchback is feature rich. We believe Toyota and Daihatsu could use this platform and strip it down on features to introduce it at an affordable price in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+