టొయోటా ఎతియోస్ క్రాస్ బుకింగ్స్ ప్రారంభం!

జపనీస్ కార్ కంపెనీ టొయోటా ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 'ఎతియోస్ క్రాస్' (Etios Cross) కోసం కంపెనీ ముందస్తు బుకింగ్‌లను స్వీకరించడాన్ని ప్రారంభించింది. ఈ ఏడదా మే నెల నుంచి ఎతియోస్ క్రాస్ డెలివరీలు ప్రారంభమవుతాయని టొయోటా పేర్కొంది. రూ.50,000ల బయానా (అడ్వాన్స్) మొత్తం చెల్లించి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో మరియు ఫియట్ నుంచి త్వరలో రానున్న అవెంచురా వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. టొయోటా ఎతియోస్ క్రాస్ రెగ్యులర్ ఎతియోస్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా కాకుండా మరింత రఫ్ అండ్ టఫ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త బంపర్‌ను అమర్చారు. ట్రాపేజోడియల్ షేపులో సిల్వర్ ఇన్‌సెర్ట్స్‌తో డిజైన్ చేసిన ఈ బంపర్ మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. వీల్ అర్చెస్ చుట్టూ అలాగే సైడ్స్‌లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అమర్చారు.


కొత్త బంపర్స్, సైడ్ సిల్స్‌తో పాటుగా, ఎతియోస్ క్రాస్‌లో కొత్తగా రూఫ్ బార్స్‌ను కూడా జోడించారు. ఈ బార్స్ 50 కిలోల వరకు బరువును మోయగలవు. టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎతియోస్ క్రాస్ బ్యాడ్జింగ్‌తో కూడిన రియర్ క్లాడింగ్ ఇందులో మరో అదనపు ప్రత్యేకత.

ఇంటీరియర్ మార్పుల విషయానికి వస్తే, దీని ఇంటీరియర్స్‌ను కొత్త పియానో బ్లాక్ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు. ఇందులో కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్‌ను జోడించారు, ఈ సీట్స్‌పై వైట్ కలర్ స్టిచింగ్‌తో చేసిన లోగో ఉంటుంది. స్పోర్టీయర్ లుక్‌నిచ్చేలా అక్కడక్కడా క్రోమ్ ఇన్‌సెర్ట్స్‌ను అమర్చారు. యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

Toyota Etios Cross Bookings

ఎతియోస్ క్రాస్‌ను లివా హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినప్పటికీ, 110 మి.మీ. పొడవును, 40 మి.మీ. వెడల్పును, 45 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. బెటర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం దీని మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్‌ను 170 మి.మీ. లకు పెంచారు. టొయోటా ఎతియోస్ క్రాస్ 1.5 లీటర్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో పాటుగా, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2014, 12:38 [IST]
English summary
Toyota have launched their Etios Cross at the recent Auto Expo. The Japanese car was showcased noticing, Indians new found love with compact SUVs. Bookings have commenced and everyone was wondering when will they get their vehicles. Toyota officials confirm deliveries will start in this year, May.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+