2014 ప్యారిస్ మోటార్ షో: ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

By Ravi

'టొయోటా ఐ-రోడ్' (Toyota i-ROAD) ఎలక్ట్రిక్ త్రీవీలర్ కాన్సెప్ట్ వాహనం గుర్తుందా..? గడచిన సంవత్సరం మార్చ్ నెలలో జరిగిన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో, జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన ఐ-రోడ్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు ఈ ఏడాది మార్చ్ నెలలో గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, ఫ్రాన్స్‌లో జరుగుతున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో టొయోటా తమ ప్రొడక్షన్ వెర్షన్ ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. అతి త్వరలోనే ఈ టొయోటా ఐ-రోడ్ యూరప్ మార్కెట్లలో విడుదల కానుంది. ఇప్పటికే, అనేక సార్లు ఈ మోడల్‌ను జపాన్ రోడ్లపై విజయవంతంగా టెస్టింగ్ చేసిన తర్వాత, తుది ఉత్పత్తిని తాజాగా ఆవిష్కరించారు.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌కు సంబంధిచిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

టొయోటా ఐ-రోడ్ ఒక టూ సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులోని బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చు.

ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

'యాక్టివ్ లీన్' టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్‌ను డ్రైవ్ చేయటం చాలా సులువు. ఇందులో ప్రయాణం కూడా చాలా సురక్షితంగాను, ఆహ్లాదకరంగాను ఉంటుంది.

ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

తక్కువ విద్యుత్‌ను, తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని, పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాలపై 40 ఏళ్లుగా టొయోటా చేస్తున్న పరిశోధనలకు ఫలితమే ఈ ఐ-రోడ్ కాన్సెప్ట్.

ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

ఈ వాహనంలోని బ్యాటరీని కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ద్విచక్ర వాహనాలతో పోల్చుకుంటే ఐ-రోడ్ కాన్సెప్ట్‌లో ఎలాంటి వాతావరణంలో అయినా (దుమ్ము, ధూళి, వర్షం, ఎండ, చలి మొదలైనవి) సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు.

ప్రొడక్షన్ వెర్షన్ టొయోటా ఐ-రోడ్

మూడు చక్రాలు కలిగిన ఈ టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ 2350 మి.మీ. పొడవును, 1445 మి.మీ. ఎత్తును, 1700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి తక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ముందు చక్రాల 2 కి.వా. సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, ఇవి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తాయి.

వీడియో

జపాన్ రోడ్లపై నిర్వహించిన టొయోటా ఐ-రోడ్ టెస్టింగ్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2014, 12:31 [IST]
English summary
Less than two years after first revealing its i-Road concept, Toyota is presenting a road-legal version of its two-seater tricycle-format personal mobility vehicle (PMV), making its European debut at the Paris motor show. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+