భారత్‌లో 119 క్యామ్రీ సెడాన్లను రీకాల్ చేసిన టొయోటా

జపనీస్ కార్ కంపెనీ టొయోటా, భారత మార్కెట్లో విక్రయించిన 119 క్యామ్రీ ప్రీమియం సెడాన్లను వెనక్కు పిలిపిస్తున్నట్లు ప్రకటించింది. మార్చ్-జులై 2011 మధ్య కాలంలో జపాన్‌లో ఉత్పత్తి అయిన టొయోటా క్యామ్రీ కార్లలోని ఫ్రంట్ సస్పెన్షన్ సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నారు.

పైన పేర్కొన్న సమయంలో టొయోటా క్యామ్రీ సెడాన్‌ను జపాన్ నుంచి దిగుమతి చేసుకొని, ఇండియన్ మార్కెట్లో విక్రయించే వారు. ఫ్రంట్ సస్పెన్షన్ సమస్య కారణంగా టొయోటా ప్రపంచ వ్యాప్తంగా రీకాల్ చేసిన 3.62 లక్షల కార్లలో భాగంగా, భారత్‌లో కూడా క్యామ్రీ కార్లను రీకాల్ చేశారు.

ఈ సమస్య వలన టొయోటా ప్రకటించిన గ్లోబల్ రీకాల్‌లో సుమారు 1.70 లక్షల క్యామ్రీ కార్లే ఉన్నాయి. భారతదేశంలో ఈ సమస్య గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా కంపెనీ ఈ రీకాల్‌ను ప్రకటించింది.

రీకాల్‌కు వర్తించే కార్ యజమానులు టొయోటా డీలర్‌షిప్‌లు సంప్రదించి, ఈ రీకాల్ గురించి తెలియజేస్తారని, సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చే క్యామ్రీ కార్లలో ఈ సమస్యను ఉచితంగా సరిచేస్తారని కంపెనీ తెలిపింది.

Toyota India Recalls 119 Units Of Camry Sedans

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న క్యామ్రీ సెడాన్‌ను టొయోటా 2012లో విడుదల చేసింది. కొత్త టొయోటా క్యామ్రీలో 2.5 లీటర్ 16 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 181 పిఎస్‌ల శక్తిని, 4100 ఆర్‌పిఎమ్ వద్ద 233 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. అమెరికాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన టొయోటా ప్రస్తుతం సుమారు 110 దేశాల్లో లభ్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల్లో క్యామ్రీ కారును ఉత్పత్తి చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లోనే టొయోటా క్యామ్రీ సెడాన్‌ను అసెంబ్లింగ్ చేయనున్నారు. టికెఎమ్‌కు బెంగుళూరులో బిడదిలో ఉన్న ప్లాంట్‌లో ఈ కారును అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇందులో ఉపయోగించే విడిభాగాలలో సుమారు 10 శాతం విడిభాగాలను దేశీయ మార్కెట్‌ నుంచే కొనుగోలు చేయనున్నారు. దేశీయ విపణిలో దీని ధర రూ.25 లక్షలకు పైమాటే.

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2014, 15:15 [IST]
English summary
Toyota Kirloskar Motor (TKM) is recalling 119 units of its sedan Camry, manufactured between March and July 2011 in Japan and sold in India, to rectify a defect in front suspension.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+