అత్యంత నాణ్యమైన ఎమ్‌పివి 'టొయోటా ఇన్నోవా'

జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి 'ఇన్నోవా' గురించి పాఠకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సెగ్మెంట్లో నెంబర్ వన్ మోడల్‌గా ఉన్న టొయోటా ఇన్నోవా ఇప్పటికే ఎన్నో ఆటోమొబైల్ అవార్డులను సొంతం చేసుకుంది. సౌకర్యవంతమైన డ్రైవింగ్/ట్రావెలింగ్ అనుభూతిని కల్పించడంలో ఇన్నోవా ది బెస్ట్ అని చెప్పవచ్చు.

తాజాగా.. జెడి పవర్ ఏషియా పసిఫిక్ 2014 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)లో టొయోటా ఇన్నోవా అత్యధిక ర్యాంకింగ్‌ను సంపాధించుకొని, ఈ సెగ్మెంట్లో అత్యంత నాణ్యమైన ఎమ్‌పివిగా నిలిచింది. అలాగే, కంపెనీ విక్రయిస్తున్న లివా హ్యాచ్‌బ్యాక్ అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో రెండవ ర్యాంక్‌ను, ఎతియోస్ సెడాన్ ఎంట్రీ మిడ్‌సైజ్ సెగ్మెంట్లో మూడవ ర్యాంక్‌ను దక్కించుకుంది.

Toyota Innova

జెడి పవర్ గడచిన 18 ఏళ్లుగా ఈ అధ్యయాన్ని నిర్వహిస్తోంది. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లు యజమానులు తొలి 2-6 నెలల్లో ఎదుర్కొన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని, ఈ రేటింగ్‌ను ఇవ్వటం జరుగుతుంది. ఈ అధ్యయనంలో క్రింద పేర్కొన్న 8 ప్రధాన విభాగాలలో సమస్యలను లెక్కించడం జరుగుతుంది.
  • ఇంజన్ అండ్ గేర్‌బాక్స్
  • వాహన ఎక్స్టీరియర్
  • డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్
  • హెచ్‌విఏసి
  • ఫీచర్లు, కంట్రోల్స్, డిస్‌ప్లేలు
  • వాహన ఇంటీరియర్
  • సీట్లు
  • ఆడియో, ఎంటర్‌టైన్‌మెంట్, నావిగేషన్

కొత్త కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు, త్వరపడండి

ఈ అన్ని సమస్యలను ప్రాబ్లమ్స్ పెర్ 100 వెహికల్స్ (పిపి100) యొక్క సంఖ్య ఆధారంగా చేసుకొని రేటింగ్ ఇస్తారు. పిపి100 రేటు తక్కువగా ఉందంటే, ఆ వాహనంలో సమస్యలు తక్కువగా ఉన్నాయని అర్థం. అంటే, అలాంటి వాహనాలు నాణ్యమైనవని కూడా అర్థం.

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2014, 10:27 [IST]
English summary
According to J.D. Power Asia Pacific 2014 India Initial Quality Study (IQS), Toyota Innova ranks highest in the MUV/MPV segment scoring the least with respect to PP100 (problems per 100 vehicles).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+