టొయోటా కార్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా ఎయిర్‌బ్యాగ్

By Ravi

మేడ్ ఇన్ ఇండియా కార్లలో విషయంలో గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) విడుదల చేసిన ఫలితాలను చూసిన తర్వాత, దేశంలోని పలు ఇతర కార్ కంపెనీలు తమ ఉత్పత్తులలోని లోపాలను సవరించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. తాజాగా.. జపాన్‌కు చెందిన టొయోటా భారత్‌లో విక్రయించే అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది.

ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన మేడ్ ఇన్ ఇండియా మారుతి స్విఫ్ట్, డాట్సన్ గో (రెండూ ఎయిర్‌బ్యాగ్‌లు లేని కార్లు) కార్లు జీరో రేటింగ్‌ను దక్కించుకొని, ఈ టెస్టులో ఫెయిల్ అయిన నేపథ్యంలో, కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులలో ఇండియాలో తయారైన మారుతి సుజుకి ఆల్టో, టాటా నానో, ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ10, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లు కూడా విఫలమయ్యాయి. (అంటే మనదేశంలో తయారయ్యే కార్లు ఎంత నాణ్యమైనవో అర్థం చేసుకోవచ్చు).

toyota car standard feature

ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఫోక్స్‌వ్యాగన్ తమ పోలో కార్లను రీకాల్ చేసి, ఎయిర్‌బ్యాగ్‌ను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా ఆఫర్ చేయటం ప్రారంభించింది. ఎయిర్‌బ్యాగ్ ఫీచర్ జోడించిన తర్వాత పోలో కారు 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్ దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో, తమ కార్ల సేఫ్టీ విషయంలో ఎన్‌సిఏపికి తమవైపు వేలెత్తి చూపించడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గాను, కంపెనీ తమ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను జోడించేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా ఈ ఫీచర్లకు సంబంధించి ప్రకటనలు కూడా చేస్తోంది.

జపాన్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్ కంపెనీ టకటా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్‌బ్యాగ్‌లను తమ కార్లలో ఉపయోగించటం, వాటి వలన పలు సమస్యలు తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా టొయోటా అనేక మోడళ్లను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే.

ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ విచ్చుకున్నప్పుడు అందులోని ఎయిర్ ఇన్‌ఫ్లేటర్ సరిగ్గా పనిచేయని కారణంగా ప్రయాణీకులు ప్రమాదాన్ని ఎదుర్కునే అవకాశం ఉందనే నెపంతో ఈ రీకాల్ చేయటం జరిగింది. కేవలం టొయోటానే కాకుండా టకటా ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన హోండా, నిస్సాన్, బిఎమ్‌డబ్ల్యూ వంటి పలు ఇతర కార్ కంపెనీలు కూడా ఇదే తరహా రీకాల్‌ను ప్రకటించడం తెలిసినదే.

మరి టొయోటా బాటలోనే ఇతర కార్ కంపెనీలు కూడా పయనించి, తమ కార్లలో సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేస్తారో లేక ప్రయాణీకుల భద్రత భారాన్ని దేవునిపైకి నెట్టివేస్తారో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2014, 16:28 [IST]
English summary
The Japanese car manufacturer Toyota, has made airbags a standard standard safety feature across all its models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+