మార్చ్ 24తో ముగియనున్న టొయోటా లాకౌట్!
వేతనాల సవరణలో విషయంలో కార్మికులతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) బెంగుళూరుకు సమీపంలో బిడది వద్ద ఉన్న తమ రెండు కార్ల తయారీ ప్లాంట్లలో మార్చ్ 16వ తేదీన కంపెనీ లాకౌట్‌ను ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే, త్వరలోనే ఈ లాకౌట్‌కు శుభం కార్డు పడనుంది.
ఇది కూడా చదవండి: టొయోటా ఎతియోస్ క్రాస్ వివరాలు
టొయోటీ కిర్లోస్కర్ మోటార్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, మార్చ్ 24వ తేదీన లాకౌట్‌ను ఎత్తివేస్తామని, అయితే ఉద్యోగులు మాత్రం మంచి ప్రవర్తనను కలిగి ఉంటామనే ఒప్పందం సంతకం చేయాలని కంపెనీ యాజాన్యం పేర్కొంది. టొయోటా యాజమాన్యం, యూనియన్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది.

ఈ రెండు ప్లాంట్లలో 4,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి వేతన పెంపు రూ.4,000 కోరుతున్నామని కార్మిక సంఘం కోరగా, యాజమాన్యం మాత్రం రూ.3,050 మాత్రమే పెంచుతామనడంతో సమస్య మొదలైంది. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో కలిపి సాలీనా 3,10,000 వాహనాలు ఉత్పత్తి అవుతాయి.
గడచిన 25 రోజులుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని టికెమ్ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఇతర కార్మికులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని లాకౌట్ ప్రకటిస్తున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వివరించింది. కానీ, ఈ లాకౌట్ అన్యాయయని, ఈ విషయంలో కంపెనీ ఏక్షపక్షంగా నిర్ణయం తీసుకున్నారని టికెఎమ్ ఎంప్లాయిస్ యూనియన్ వాదిస్తోంది.


Click it and Unblock the Notifications








