భారత్‌లో 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన టొయోటా

By Ravi

జపాన్ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పోరేషన్‌కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) భారత మార్కెట్లో 10 లక్షల అమ్మకాలు మైలురాయిని (1 మిలియన్ సేల్స్ మైల్‌స్టోన్) అధిగమించింది.

టికెఎమ్ తమ 10 లక్షవ కారును కొచ్చిన్‌లోని టొయోటా అధీకృత డీలర్‌షిప్ అయిన నిప్పాన్ టొయోటా ద్వారా విక్రయించారు. ఈ 10 లక్షవ కారు టొయోటా ఎతియోస్. టొయోటా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కస్టమర్‌కు ఈ కారును అందజేశారు.

టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రాజా మాట్లాడుతూ.. టొయోటా‌కు ఇదొక ప్రత్యేకమైన సందర్భమని, భారత మార్కెట్‌లో 10 లక్షవ కారును విక్రయించడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Toyota India Touch One Million Sales

టొయోటాకు ప్రీమియం ఎమ్‌పివి/ఎస్‌యూవీ సెగ్మెంట్లో మంచి పట్టు ఉంది. అలాగే, ఎతియోస్ మరియు లివా హ్యాచ్‌బ్యాక్‌లతో కూడా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో టొయోటా మంచి బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్‌కు ఇప్పటికీ తమ ఇన్నోవా ఎమ్‌పివి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఈ సెగ్మెంట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు ప్రవేశించినప్పటికీ టొయోటా ఇన్నోవాకు మాత్రం గట్టి పోటీని ఇవ్వలేకపోయాయి.

టొయోటా 1997లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టొయోటాకు భారత్‌లో సాలీనా 3.10 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. టొయోటా 10 లక్షల కార్ల అమ్మకాల సందర్భంగా మా డ్రైవ్‌‌స్పార్క్ బృందం టొయోటాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2014, 16:26 [IST]
English summary
Toyota and their Indian partner Kirloskar reached a landmark of one million unit sales. Toyota Kirloskar Motor sold their one millionth car, in Cochin. The authorised Toyota dealer was Nippon Toyota and the car delivered was an Etios. They had organised a special ceremony for their 1 millionth satisfied customer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+