టొయోటా నుంచి రిఫ్రెష్డ్ ఎతియోస్ సెడాన్, లివా హ్యాచ్‌బ్యాక్
ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు కార్ మేకర్లు, తమ ప్రస్తుత ఉత్పత్తులను మరింత కొత్తగా చూపించి లిమిటెడ్ ఎడిషన్లు, స్పెషల్ ఎడిషన్లు అంటూ విక్రయించడం మామూలే. ఇప్పటికే పలు కార్ కంపెనీలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. తాజాగా.. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.
టొయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న టొయోటా ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి 'కొత్త ఎతియోస్', 'కొత్త ఎతియోస్ లివా' పేర్లతో ఈ వారంలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త మోడళ్లలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో మైనర్ అప్‌డేట్స్ ఉండనున్నాయి.

కొత్త ఎతియోస్ సెడాన్‌లో క్రోమ్ ఫినిష్డ్ సింగిల్ టూత్ గ్రిల్ ఉండనుంది, అలాగే కొత్త లివా హ్యాచ్‌బ్యాక్‌లో కూడా సరికొత్త గ్రిల్ డిజైన్‌ను (క్రోమ్ లేకుండా) కలిగి ఉంటుంది. వీటి సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైళ్లలో చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే, ఈ రెండు మోడళ్లలో పార్కింగ్ సెన్సార్లు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా లభించే ఆస్కారం ఉంది.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేసిన సీట్స్ మరియు డోర్ ప్యానెళ్లు, ఫాక్స్ లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్టింగ్ నాబ్, స్టాండర్డ్‌గా లభించే డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి మార్పులు ఉందులో ఉండనున్నాయి. ఇకపోతే యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

ఈ కొత్త టొయోటా ఎతియోస్, లివా మోడళ్లను కంపెనీ ఈనెల 15వ తేదీన మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ కార్లలో చేసిన కొత్త మార్పుల నేపథ్యంలో, వీటి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎతియోస్ సెడాన్ ధరలు రూ.5.39 లక్షల నుంచి రూ.8.08 లక్షల మధ్యలో ఉండగా, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.40 లక్షల నుంచి రూ.6.91 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications








