రెడ్ బుల్ ట్రోఫీలను దొంగలెత్తుకెళ్లారు; కొన్ని సరస్సులో దొరికాయ్

Written By:

డిసెంబర్ 5వ తేదీన రాత్రి సమయంలో కొందరు దొంగలు రెడ్ బుల్ ఎఫ్1 ఫ్యాక్టరీలోకి ప్రవేశించి, డిస్‌ప్లేలో ఉంచిన దాదాపు 60 ట్రోఫీలను దోచుకెళ్లారు. వివిధ రెడ్ బుల్ జట్లు ఎంతో కష్టపడి సాధించిన, వెలకట్టలేని ట్రోఫీలను ఆరుగురు దుండగులు కలిసి దోపిడీ చేశారు.

కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, దుండగులు దోచుకెళ్లిన ట్రోఫీలలో దాదాపు 20 ట్రోఫీలు రికవరీ అయ్యాయని థామస్ వ్యాలీ పోలీసులు వెల్లడించారు. శాండర్స్ట్ సమీపంలోని హార్స్‌షూ లేక్ వద్ద వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దోపిడీ జరిగిన రోజున ఆరుగురు వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి, రెండు కార్లతో (ఓ 4x4 కార్, మరో మెర్సిడెస్ బెంజ్ వ్యాగన్) ఫ్యాక్టరీ ఫ్రంట్ గేట్ గుండా లోనికి ప్రవేశించి, ట్రోఫీలను ఎత్తుకెళ్లారు. ఈ కార్లు రెండూ విదేశీ రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం.

ఈ సంఘటన నేపథ్యంలో, ఫ్యాక్టరీలోకి సందర్శకులను అనుమతించడంపై పరిమితులు విధించాల్సి ఉంటుందని రెడ్ బుల్ జట్టు బాస్ క్రిస్టియన్ హార్నర్ చెప్పాడు. దుండగులు దోచుకెళ్లిన ట్రోఫీలు కేవలం తమకు మాత్రమే సంబంధించినవి కావని, ఎంతో మంది ఔత్సాహికులు తమ కృషి, కష్టంతో సాధించుకున్నవని ఆయన అన్నారు.

Trophies Stolen From Red Bull F1 Factory
English summary
The Red Bull F1 factory in Milton Keynes has been looted of nearly 60 trophies. According to the latest update, Thames Valley Police has announced approximately 20 of the stolen Red Bull trophies have been recovered.
Story first published: Wednesday, December 17, 2014, 13:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark