వరుణ్ మోటార్స్‌కు 'ఛాంపియన్లకే ఛాంపియన్' అవార్డ్

By Ravi

వినియోగదారులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందించిన డీలర్లను గుర్తించేందుకు గాను, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందించే అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఛాంపియన్లకే ఛాంపియన్‌' అవార్డును ఈసారి మన రాష్ట్రానికి చెందిన వరుణ్‌ మోటార్స్‌‌ను వరించింది.

వరుణ్ మోటార్స్ గడచిన 18 సంవత్సరాలుగా మారుతి సుజుకి డీలర్‌గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 340 మంది మారుతి డీలర్లలో వెనక్కి నెట్టి ఈ అవార్డును తమ డీలర్‌షిప్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని వరుణ్ మోటార్స్ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభు కిశోర్‌ తెలిపారు.


ఈ తాజా అవార్డుతో దాదాపు రెండు దశా బ్దాలుగా మారుతి డీలర్‌గా కొనసాగుతున్న వరుణ్‌ మోటార్స్ సంస్థ కీర్తికిరీటంలో మరో కలికి తురాయి వచ్చినట్లయిందని ఆయన అన్నారు. వరణ్‌ మోటార్స్‌ సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఈ అవార్డును సొంతం చేసుకోగలిగామని ప్రభు కిషోర్ చెప్పారు.

మారుతి సుజుకి పొందుపర్చిచిన పది విభాగాలను వరుణ్‌ మోటార్స్‌ విశేష నైపుణ్యంతో, సదరు కంపెనీ వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందించిందకు గాను ఈ అవార్డు తమను వరించిందని, ఈ అవార్డు రావడంతో తమ సంస్థపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.

Champions Of The Champion

ఈ అవార్డు స్ఫూర్తితో తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడం కోసం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 30 మండల కేంద్రాల్లో మారుతి సుజుకి షోరూమ్‌లు ఏర్పాటు చేయటంతో పాటుగా ప్రతి షోరూమ్ వద్ద మొబైల్‌ వర్క్‌షాప్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.

గడచిన సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కోవటం వలన 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 10 శాతం అమ్మకాలు తగ్గినప్పటికీ, రూ.1300 కోట్లు టర్నోవర్‌ చేయగలిగిందని, గత ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని మారుతి సుజుకి డీలర్లు కలిసి 50,000 కార్లను విక్రయిస్తే తమ సంస్థ 20,000 కొత్త కార్లను విక్రయించగలిగిందని తెలిపారు. ఈ అమ్మకాల్లో వరుణ్‌ మోటార్స్‌ వాటా 40 శాతంగా ఉందని కిశోర్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, May 16, 2014, 11:08 [IST]
English summary
Varun Motors Pvt Ltd, one of the largest Maruti Suzuki car dealers in Andhra Pradesh has been awarded with the prestigious 'Champions of the Champion' from Maruti Suzuki India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+