వాహనల వేగ పరిమితిని సవరించనున్న మోడీ సర్కార్!

By Ravi

కేంద్రలో కొత్తగా ఏర్పడిన బిజెపి సర్కారు భారతదేశపు రోడ్లపై సంచరిస్తున్న వాహనాల వేగ పరిమితిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మనదేశంలో విభిన్న రకాల వాహనాలకు విభిన్న వేగ పరిమితులు (స్పీడ్ లిమిట్స్) ఉండటం వలన వీటి నియంత్రణ క్లిష్టంగా మారుతోంది.

అయితే, ప్రస్తుతం మన రోడ్లపై తిరుగుతున్న అనేక కార్లు మోడ్రన్‌వే అయినప్పటికీ, స్పీడ్ లిమిట్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. ఈ నేపథ్యంలో, ప్రతి వాహన తరగతి (వెహికల్ క్లాస్)కి సంబంధించి స్పీడ్ లిమిట్‌ను పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.


కార్ల కోసం స్పీడ్ లిమిట్‌ను గంటకు 100 కి.మీ. మరియు మోటార్‌సైకిళ్లు, గూడ్స్ వాహనాల కోసం స్పీడ్ లిమిట్‌ను గంటకు 80 కి.మీ. లకు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే క్వాడ్రిసైకిల్స్ (నాలుగు చక్రాల వాహనాల) కోసం కూడా వేగ పరిమితిని గంటకు 70 కి.మీ. లకు పరిమితం చేయాలని యోచిస్తోంది.

చివరిసారిగా భారత రోడ్లపై స్పీడ్ లిమిట్స్‌ను సవరించినది దాదాపు 20 ఏళ్ల క్రితం, అప్పటి రోడ్డ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పీడ్ లిమిట్స్‌ను మార్పు చేసింది. వాహనాల వేగ పరిమితిని సవరించేందుకు అప్పట్లో వారు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

Bike Speed Limit

రోడ్ సేఫ్టీ నిపుణులు, ప్యానెల్ సభ్యుడు అయిన రోహిత్ బలూజా మాట్లాడుతూ.. ఒకే హైవే లైనుపై విభిన్న రకాల వాహనాలకు విభిన్న స్పీడ్ లిమిట్స్‌ను ఉంచకూడదనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచామని, కనీస స్పీడ్ లిమిట్‌ను సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందని, ఒకే రహదారిపై విభిన్న స్పీడ్ లిమిట్స్ ఉండకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, జాతీయ రహదారులపై ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేలపై మోటార్‌సైకిళ్లకు అనుమతి లేదు, వాటి కనీస స్పీడ్ లిమిట్ కేవలం గంటకు 50 కి.మీ. మాత్రమే కావటంతో మోటార్‌సైకిళ్లను ఆ రోడ్లపై అనుమతించరు. అయితే, కొత్త స్పీడ్ లిమిట్స్ (మోటార్‌సైకిళ్ల కోసం గంటకు 80 కి.మీ.) అమల్లోకి వస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై కూడా మోటార్‌సైకిళ్లు పరుగులు తీసే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2014, 10:49 [IST]
English summary
The newly appointed Indian government is on a process of improving small, however, important situations. The government has now decided to take up the issue of vehicle speed on our road. Currently we have different speed limits for different vehicle types, which makes it difficult to control.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+