వీడియో: యుద్ధనౌకపై బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 డ్రిఫ్టింగ్
జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ పవర్‌ఫుల్ కార్ 'బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4' కోసం ఓ స్టన్నింగ్ కమర్షియల్‌ను డిజైన్ చేసింది. వళ్లు గగుర్పొడిచే రీతిలో, సముద్రం మధ్యలో ఉన్న ఓ యుద్ధనౌకలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అల్టిమేట్ రేస్ ట్రాక్‌పై సరికొత్త గోల్డెన్ కలర్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కారుతో చేసిన డ్రిఫ్టింగ్ దృశ్యాలు చూసిన వారు ఎవ్వరైనా శభాష్ అని సదరు డ్రైవర్‌ను మెచ్చుకోక మానరు.
యుద్ధ విమానాలను తీసుకువెళ్లే ఓ నౌకపై సరికొత్త ఎఫ్82 ఎమ్4 మోడల్‌తో డ్రిఫ్టింగ్ చేస్తూ, ఆ కారు యొక్క ప్రత్యేకలను కస్టమర్లకు వివరించేందుకు బిఎమ్‌డబ్ల్యూ ఈ స్టన్నింగ్ కమర్షియల్‌ను రూపొందించింది. నౌక అంచున చేసే డ్రిఫ్టింగ్ చూస్తే అవాక్కవ్వటం ఖాయం. ఇందులో ఏమాత్రం క్యాలుక్యులేషన్ మిస్ అయినా కారు నేరుగా సముద్రంలో పడిపోతుంది. మరి ఆ స్టన్నింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/AFtUpMTs4vI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








