టొయోటా ఐ-రోడ్ త్రీవీలర్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్
గడచిన సంవత్సరం మార్చి నెలలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో టొయోటా మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన పర్సనల్ మొబిలిటీ వెహికల్ 'టొయోటా ఐ-రోడ్' (Toyota i-ROAD) ఎలక్ట్రిక్ త్రీవీలర్ కాన్సెప్ట్ వాహనం ఉత్పత్తి దశకు చేరుకోనుందని, అలాగే దీనిని టొయోటా సిటీలో ట్రైల్ రన్ నిర్వహిస్తామని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
ఈ నేపథ్యంలో, టొయోటా తమ ఐ-రోడ్ వాహనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దీనిని నగర రోడ్లపై ప్రయోగాత్మంగా నడిపి డెమోన్‌స్ట్రేషన్ చేసింది. ఆ అమేజింగ్ వీడియోని మనం కూడా వీక్షిద్దాం రండి.
టొయోటా ఐ-రోడ్ ఒక టూ సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చు. 'యాక్టిల్ లీన్' టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్‌ను డ్రైవ్ చేయటం చాలా సులువు. ఇందులో ప్రయాణం కూడా చాలా సురక్షితం గాను, ఆహ్లాదకరం గాను ఉంటుంది.

తక్కువ విద్యుత్‌ను, తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని, పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాలపై 40 ఏళ్లుగా టొయోటా చేస్తున్న పరిశోధనలకు ఫలితమే ఈ ఐ-రోడ్ కాన్సెప్ట్. ఈ వాహనంలోని బ్యాటరీని కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ద్విచక్ర వాహనాలతో పోల్చుకుంటే ఐ-రోడ్ కాన్సెప్ట్‌లో ఎలాంటి వాతావరణంలో అయినా (దుమ్ము, ధూళి, వర్షం, ఎండ, చలి మొదలైనవి) సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు.
మూడు చక్రాలు కలిగిన ఈ టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ 2350 మి.మీ. పొడవును, 1445 మి.మీ. ఎత్తును, 1700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి తక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ముందు చక్రాల 2 కి.వా. సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, ఇవి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తాయి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/T-dw9NwF3lM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








