ఫోక్స్‌ఫెస్ట్ 2014: ఫోక్స్‌వ్యాగన్ కార్లపై ఆకర్షనీయమైన ఆఫర్స్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, 'ఫోక్స్‌ఫెస్ట్ 2014' (Volksfest 2014) పేరిట ఓ 24 రోజుల మెగా కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్లు విలువైన ఆఫర్లను, ఆకర్షనీయమైన ప్రయోజనాలను మరియు అశ్శూర్డ్ గిఫ్ట్‌లను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

అంతేకాకుండా, ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ కార్నివాల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్న పలు ఫోక్స్‌వ్యాగన్ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

Volkswagen Announce Volksfest 2014

ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించబడిన ఫోక్స్‌ఫెస్ట్ 2014 సమయంలో, కస్టమర్లు కార్ ఫైనాన్స్‌పై బెస్ట్ డీల్స్‌ను పొందవచ్చు అలాగే కొత్త కారు కొనుగోలుపై విలువైన ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇంకా సేల్స్, సర్వీసెస్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎంపిక చేసిన ఫోక్స్‌వ్యాగన్ జినైన్ యాక్ససరీస్ మరియు మర్చండైస్, బాడీ అండ్ పెయింట్ సర్వీసులపై బెనిఫిట్స్ పొందవచ్చు.

కొత్త పోలో కారు కొనుగోలుపై ఉచిత ఇన్సూరెన్స్, ఫోక్స్‌వ్యాగన్‌కు అప్‌గ్రేడ్ అయి వెంటో మరియు జెట్టా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.1,00,000ల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కు చెందిన సెకండ్ హ్యాండ్ కార్ డివిజన్ దస్ వెల్ట్ఆటో ద్వారా పొందవచ్చు. ఫోక్స్‌ఫెస్ట్ 2014 అక్టోబర్ 8, 2014వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 31, 2014 వరకు సాగుతుంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధీకృత డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2014, 12:07 [IST]
English summary
Volkswagen India has announced the ‘Volksfest 2014,’ a 24-day mega-carnival where the company’s existing and prospective customers can avail of a range of valuable offers, exciting benefits and assured gifts. In addition, prospective customers will also be able to test drive Volkswagen cars of their choice at Volkswagen dealerships across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+