ఎక్సైజ్ సుంకం తగ్గింపు; కార్ల ధరలను తగ్గించిన ఫోక్స్‌వ్యాగన్
మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని కార్ మోడళ్ల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ధరలను వేరియంట్‌ను బట్టి రూ.18,000 నుంచి రూ.31,000 మేర తగ్గిస్తున్నామని అలాగే ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ధరలను వేరియంట్‌ను బట్టి రూ.14,500 నుంచి రూ.27,000 మేర తగ్గిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

కాగా.. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ జెట్టా ధరలు వేరియంట్‌ను బట్టి రూ.38,000 నుంచి రూ.51,000 మేర తగ్గాయి. ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
కార్లపై ఎక్సైజ్ సుంకాంన్ని తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, దీని వలన కలిగే మొత్తం ప్రయోజనాన్ని తమ వినియోగదారులకే అందిస్తామని, ఈ నిర్ణయం వలన ఆటోమొబైల్ పరిశ్రమలో మార్కెట్ సెంటిమెంట్ మెరుగు పడుతుందని ఆశిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా తెలిపారు.


Click it and Unblock the Notifications








