వరుసగా 9వ సారి ఫోక్స్‌వ్యాగన్‌కు 'ఇంజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్'
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తయారు చేస్తున్న 1.4 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ వరుసగా 9వ సారి ఇంజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. 1.0 లీటర్ నుంచి 1.4 లీటర్ కేటగిరీలో ఇంజన్ బిల్డింగ్ టెక్నాలజీ కొత్త ప్రమాణాలు సృష్టించినందుకు గాను ఈ ఇంజన్ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది.
ఈ టిఎస్ఐ ఇంజన్ తక్కువ క్యూబిక్ కెపాసిటీని కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువ క్యూబిక్ కెపాసిటీ కలిగి ఉన్న ఇంజన్లు ఉత్పత్తి చేసే శక్తికి సమానమైన శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లను రెండు వేరియంట్లలో (90 పిఎస్, 300 పిఎస్) లభిస్తాయి.

2006లో తయారు చేసిన తొలి ఇంజన్లలో ట్విన్ చార్జర్లను ఉపయోగించేవారు. ఇవి గరిష్టంగా 140 పిఎస్‌లు, 170 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసేవి. మరో అదనపు టర్బోచార్జర్ సాయంతో దీని పెర్ఫార్మెన్స్‌ను మరింత మెరుగుపరచారు. ఈ ఇంజన్లను బీటెల్, జెట్టా, ఈఓఎస్, గోల్ఫ్ క్యాబ్రియోలెట్, టైగన్, టోరెగ్, పస్సాట్, షారన్ మోడళ్లలో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
ఈ టిఎస్ఐ ఇంజన్ ఫ్యామిలీలో కొత్త వచ్చి చేరిన 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీనిని కొత్త పోలో టిఎస్ఐ బ్లూమోషన్ వేరియంట్లో ఉపయోగిస్తున్నారు. ఈ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది. ఇది తక్కువ సిఓ2 ఉద్ఘారాలను విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








