భారత మార్కెట్ నుంచి ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ఎస్‌యూవీ మాయం!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఇంపోర్టెడ్ లగ్జరీ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్‌ను సైలెంటర్‌గా మార్కెట్ నుంచి తొలగించి వేసింది. భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్, క్రాస్ పోలో క్రాసోవర్, వెంటో మిడ్-సైజ్ సెడాన్, జెట్టా ప్రీమియం సెడాన్లతో పాటుగా టోరెగ్ ఎస్‌యూవీని కూడా ఆఫర్ చేస్తూ వచ్చింది.
అయితే, గత కొంత కాలంగా ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోతుండటంతో, కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భారత్‌లో ఆఫర్ చేస్తున్న అన్ని మోడళ్లను (టోరెగ్ మినహా) ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది. టోరెగ్ ఎస్‌యూవీని మాత్రం సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

అధిక దిగుమతి సుంకాల కారణంగా, పూర్తిగా విదేశాల్లో తయారైన ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ఎస్‌యూవీని ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించడం మూలానా ఈ మోడల్ ధర కూడా అధికంగా ఉండేది. అందుకే, ఈ సెగ్మెంట్లో అమ్మకాలు అంత జోరుగా సాగలేదు.
వాస్తవానికి ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగిన ప్రీమియం ఎస్‌యూవీ. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది. కాకపోతే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈ మూడు లగ్జరీ కార్ బ్రాండ్‌లకు ఉన్న విలువ ఫోక్స్‌వ్యాగన్ లేనట్లు తెలుస్తోంది. లగ్జరీ కారును కస్టమర్లు బాగా ప్రాచుర్యం పొందిన ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీల కార్లను కొనాలనుకుంటారు కానీ ఫోక్స్‌వ్యాగన్ కారు కొనాలనుకోరు.

ఇండియన్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 3.0 లీటర్, వి6, టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 240 బిహెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఈ మోడల్‌ను స్లోవేకియాలోని ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేసి సిబియూ రూట్ ద్వారా ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించేవారు. విశాలమైన క్యాబిన్ స్పేస్, ప్రీమియం ఫీచర్స్, పవర్‌ఫుల్ స్టయిల్‌తో కూడిన ఈ కారును భారత మార్కెట్ నుంచి తొలగించివేయటం విచారకరమైన విషయమే అయినప్పటికీ, భారత వంటి మాస్ మార్కెట్ల కోసం ఫోక్స్‌వ్యాగన్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తుండటం మాత్రం సంతోషకరమైన విషయమే. మరి కంపెనీ ఈ మోడల్ ధరనైనా ఆచితూచి నిర్ణయిస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








