టెస్టింగ్ దశలో కెమరాకు చిక్కిన ఫోక్స్‌‌వ్యాగన్ గోల్ఫ్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మరో సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. గ్లోబల్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన 'ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్' (Volkswagen Golf) హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గడచిన కొద్ది కాలంగా తమ గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇటీవలే ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా కెమరాకు చిక్కింది. బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ, ఓ చోట పార్క్ చేయబడి ఉన్న గోల్ఫ్ కారు ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

VW Golf

అయితే, ఇది గోల్ఫ్ టెస్టింగ్ వాహనమా లేక ఎవరైనా ప్రత్యేకించి ఇండియాకు దిగుమతి చేయించుకున్న స్వంత వాహనమా అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ, ఫోక్స్‌వ్యాగన్ మాత్రం భారత్‌లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే దిశలో భాగంగా, తమ పాపులర్ గోల్ఫ్ హ్యాచ్‌‌బ్యాక్‌ను ఇండియాకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్ కారులో పాపులర్ 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెటోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఈ కారు 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవును (4.25 మీటర్లు) కలిగి ఉంటుంది. అయితే, మన దేశంలో ఇది ఎక్సైజ్ మినహాయింపు క్రిందకు రాదు కాబట్టి, దీని ధర అధికంగా ఉండే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2014, 10:25 [IST]
English summary
Volkswagen's premium hatchback Golf caught uncamouflaged while testing in Bangalore. According to recent reports, Volkswagen India might launch this premium hatchback in 2014. Stay tuned to drivespark.com for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+