ఫోక్స్‌వ్యాగన్ 7వ వార్షికోత్సవం; కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, భారత మార్కెట్లోకి ప్రవేశించి అప్పుడే ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ తొలిసారిగా 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తి పస్సాట్ లగ్జరీ సెడాన్.

భారత్‌లో 7 విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పోలో, వెంటో, జెట్టా మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ఇటీవలే తమ సరికొత్త రిఫ్రెష్డ్ పోలో హ్యాచ్‌బ్యాక్ కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకే విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ మోడల్‌పై కంపెనీ రూ.18,000 బెనిఫిట్లను ఆఫర్ చేస్తోంది.

Volkswagen

అంతేకాకుండా, ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును రుణం ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆకర్షనీయమైన రూ.8,888 ఈఎమ్ఐ స్కీమ్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే, వెంటో సెడాన్‌పై ఉచిత ఇన్సూరెన్స్, రెండేళ్ల పాటు ఉచిత యాన్యువల్ మెయింటినెన్స్ చార్జ్ (ఏఎమ్‌సి), మూడవ సంవత్సరం అదనపు వారంటీలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఇంకా వెంటో సెడాన్‌పై రూ.30,000 విలువైన ఎక్సేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇకపోతే కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ జెట్టాపై కంపెనీ రూ.50,000 విలువైన నగదు ప్రయోజనాన్ని మరియు రూ.30,000 విలువైన ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత ఫోక్స్‌వ్యాగన్ డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 10, 2014, 16:24 [IST]
English summary
Volkswagen has been in India now for a period of seven years. They have decided to celebrate this occasion by providing discounts to their customers. The offers will available for a limited period and on selected models of Volkswagen. The German manufacturer entered India in 2007 with their Passat model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+