భారత్‌లో మరో రూ.1500 కోట్ల పెట్టుబడి: ఫోక్స్‌వ్యాగన్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో భారీ పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడులతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే, సుమారు రూ.1500 కోట్ల (250 మిలియన్ డాలర్స్) భారత్ కోసం కేటాయిస్తున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: కొత్త 2014 పోలో, ధర రూ.4.99 లక్షలు మాత్రమే!
ప్రస్తుత వాహనాల అప్‌గ్రేడ్ చేసేందుకు, కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో మారుతి సుజుకి మాదిరిగా విస్తృతమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో మరియు డీలర్‌షిప్/సర్వీస్ నెట్‌వర్క్ లేని కారణంగా, కంపెనీ ఇక్కడి మార్కెట్లో ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయింది.

ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే భారత్‌లో సుమారు రూ.4,000 కోట్లు పెట్టుబడులను వెచ్చింది. అయినప్పటికీ, ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వాటా రెండు శాతమే. ఈ నేపథ్యంలో, తాజాగా వెచ్చించబోయే పెట్టుబడులతో తమ కంపెనీని గాడిన పెట్టాలని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భావిస్తోంది.
తమ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, సరికొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ కోడుముడి తెలిపారు. కొత్త 2014 పోలో హెచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్‌లో బడ్జెట్ కార్లను ప్రవేశపెట్టాలని ఆయన చెప్పారు. అంటే త్వరలోనే ఫోక్స్‌వ్యాగన్ నుంచి చవక ధరకే కార్లు లభ్యమవుతాయన్నమాట.
ఈ షాకింగ్ వీడియోని చూశారా?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/1N5THRSp4hM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








