త్వరలో పూనేలో ఐటి కేంద్రాన్ని ప్రారంభించనున్న ఫోక్స్‌వ్యాగన్
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్, భారత్‌లో ఓ ఐటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పూనేలో ఈ ఐటి కేంద్రాని నెలకొల్పాని, వచ్చే నెలలో ఈ పనులు ప్రారంభమవుతాయని సమాచారం.
భారత్‌లో ఏర్పాటు చేయనున్న ఫోక్స్‌వ్యాగన్ ఐటి కేంద్రానికి మిలాన్ కుమార్ అధ్యక్షత వహిస్తారని తెలుస్తోంది. రానున్న మూడు నాలుగేళ్లలో ఈ ఐటి సెంటర్ కోసం 1000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నారు. భారత ఇంజనీర్ల నైపుణ్యాన్ని వినియోగించుకొని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీలకు కావల్సిన ఐటి మద్ధతును ఈ సెంటర్ ద్వారా అందించాలన్నది కంపెనీ లక్ష్యం.

ఇప్పటికే జనరల్ మోటార్స్, ఫియట్, హ్యుందాయ్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా భారత్‌లోని ఐటి మరియు ఆర్ అండ్ డి వనరుల కోసం భారీ మొత్తాలలో పెట్టుబడులు వెచ్చిస్తున్న సంగతి తెలిసినదే. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బోష్‌కు బెంగుళూరులో ఉన్న ఐటి కేంద్రంలో దాదాపు 4000 మందితో కూడిన బలిష్టమైన ఐటి వర్క్‌ఫోర్స్ ఉంది.
కాగా.. పూనేలో ప్రారంభించనున్న ఫోక్స్‌వ్యాగన్ ఐటి కేంద్రం తొలుత నెమ్మదిగానే కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, తర్వాతి దశలలో దీనిని మరింత విస్తృతం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 9000 మంది ఐటి ఉద్యోగులు ఉండగా, తాజాగా భారత్‌లో మరో 1000 మంది ఐటి నిపుణులను చేర్చుకోనుంది. దీంతో వీరి సంఖ్య 10,000 లకు పెరగనుంది.


Click it and Unblock the Notifications








