ఫోక్స్‌వ్యాగన్ నుంచి 10-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భవిష్యత్తులో తయారు చేయబోయే కార్లలో 10-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించనుంది. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో 10 గేర్లు ఉంటాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు ఇంజన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ 10-స్పీడ్ గేర్‌బాక్స్ సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ తమ 10-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ 2020 నాటికి తమ వాహనాల్లో ఉపయోగించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 10-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించడం వలన ఇంజన్ సామర్థ్యం దాదాపు 15 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ వివరించింది.

ప్రస్తుతం ఫోక్స్‌‌వ్యాగన్ అందిస్తున్న ఆటోమేటిక్ కార్లలో 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తున్నారు. తమ కొత్త ఇంజన్‌ను లాంగిట్యూడినల్ అలాగే ట్రాన్స్‌వెర్స్ అప్లికేషన్లు రెండింటికీ ఉపయోగించుకోవచ్చని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.

Volkswagen Working On A 10-Speed DSG

ఫోక్స్‌వ్యాగన్ భవిష్యత్తులో అందించబోయే పవర్ ప్యాక్డ్ మోడళ్ల యొక్క సామర్థ్యాన్ని, పెర్ఫార్మెన్స్‌ను మరింత పెంచేందుకు గాను ఈ కొత్త 10-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించనున్నారు. ఈ గేర్‌బాక్స్‌ను 500ఎన్ఎమ్ లేదా అంతకంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేసే మోడళ్లలో ఉపయోగిస్తారు.

ఇదిలా ఉండగా.. ఓ సరికొత్త 4-సిలిండర్, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను తయారు చేసే కొత్త ప్రాజెక్ట్‌ను ఫోక్స్‌వ్యాగన్ ధృవీకరించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 236 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్విన్ టర్బోచార్జర్ ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి తమ 8వ తరం పస్సాట్ లగ్జరీ సెడాన్‌లో ఈ కొత్త ఇంజన్‌ను పరిచయం చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 15, 2014, 10:01 [IST]
English summary
Volkswagen has confirmed they are working in a 10-speed dual-clutch auto gearbox. The German company will be introducing this engine in its future line of cars, in an attempt to lower emissions and increase efficiency of their engines.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+