కేవలం 47 గంటల్లోనే ఖాలీ అయిపోయిన వోల్వో ఎక్స్‌సి90 స్టాక్

By Ravi

స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ వోల్వో గడచిన నెలలో ఆవిష్కరించిన తమ అధునాతన మరియు అత్యంత సురక్షితమైన కారు 'వోల్వో ఎక్స్‌‌సి90' ఫస్ట్ ఎడిషన్ అమ్మకాలు కేవలం 47 గంటల్లోనే అమ్ముడైపోయాయి. వోల్వో తమ సరికొత్త ఎస్‌యూవీ కోసం ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు స్వీకరించింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా కేవలం 1,927 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు.

స్టన్నింగ్ లుక్స్, సాటిలేని సేఫ్టీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న వోల్వో ఎక్స్‌సి90 ఫస్ట్ ఎడిషన్‌‌ను సొంతం చేసుకునేందుకు కార్ ప్రియులు ఎగబడ్డారు. వోల్వో పేర్కొన్న సమాచారం ప్రకారం, కేవలం ఒక్క గంటలోనే ఈ యూనిట్లన్నీ రిజర్వ్ చేసుకోబడ్డాయట. అంటే సగటును ప్రతి నిమిషానికి 7 వోల్వో ఎక్స్‌సి90 ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయన్నమాట.

Volvo XC90

ఈ సరికొత్త వోల్వో ఎక్స్‌సి90 ఫస్ట్ ఎఢిషన్ ఆంక్సీ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్‌తో లభిస్తుంది. ఇందులో 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్, నప్పా లెథర్ సీట్స్, లెథర్ వ్రాప్డ్ డ్యాష్‌బోర్డ్, లీనియర్ వాల్‌నట్ ఇన్‌లేస్, బోవర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

వోల్వో ఎక్స్‌సి90 ఎస్‌యూవీలో ఫోర్-సిలిండర్, డ్రైవ్-ఈ ఇంజన్లను ఉపయోగించారు. ఇందులోని డి5 ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 225 పిఎస్‌ల శక్తిని, 470 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. వోల్వో ఎక్స్‌సి90 ఎస్‌యూవీలోని సేఫ్టీ ఫీచర్ల వివరాలను తెలుసుకునేందుకు ఈ లింకుపై కానీ లేదా పై ఫొటోపై కానీ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 11, 2014, 18:29 [IST]
English summary
The Swedish carmaker Volvo has opened bookings for the 1,927 examples of its 2015 XC90 First Edition SUV, which were all sold out within 47 hours. The Volvo XC90 will offer some of the most comprehensive and technologically sophisticated standard safety packages available in the automotive industry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+