ఫోక్స్‌వ్యాగన్ 10-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆవిష్కరణ
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, ఓ సరికొత్త 10-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. కంపెనీ తాజాగా పూర్తిగా తయారు చేసిన 10-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌ను కంపెనీ ఆవిష్కరించింది.
ఈ కొత్త 10-స్పీడ్ గేర్‌బాక్స్‌ను డిక్యూ511 అని పిలుస్తారు. కంపెనీ అందిస్తున్న జెట్టా, ఆక్టావియా వంటి కార్లలో ఉపయోగిస్తున్న7-స్పీడ్ డిక్యూ500కు అడ్వాన్స్డ్ వెర్షనే ఈ 10-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్. లాజిక్ ప్రకారం, 10-స్పీడ్ గేర్‌బాక్స్ 7-స్పీడ్ గేర్‌బాక్స్ కన్నా పెద్దదిగా, హెవీగా ఉండాలి. కానీ, ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ డిక్యూ511 10-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాత్రమే అదే బరువును, పరిమాణాన్ని కలిగి ఉంటుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే.. 7-స్పీడ్ డిక్యూ500లో ఉపయోగిస్తున్న గేర్ సెట్ల సంఖ్యనే ఈ కొత్త 10-స్పీడ్ గేర్‌బాక్స్‌లోను ఉపయోగిస్తున్నారు. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో 10 గేర్లు ఉంటాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు ఇంజన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ 10-స్పీడ్ గేర్‌బాక్స్ సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ తమ 10-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ 2020 నాటికి తమ వాహనాల్లో ఉపయోగించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 10-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించడం వలన ఇంజన్ సామర్థ్యం దాదాపు 15 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ వివరించింది.
ఫోక్స్‌వ్యాగన్ భవిష్యత్తులో అందించబోయే పవర్ ప్యాక్డ్ మోడళ్ల యొక్క సామర్థ్యాన్ని, పెర్ఫార్మెన్స్‌ను మరింత పెంచేందుకు గాను ఈ కొత్త 10-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించనున్నారు. ఈ గేర్‌బాక్స్‌ను 500ఎన్ఎమ్ లేదా అంతకంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేసే మోడళ్లలో ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications








