విస్కీ వ్యర్థంతో ఇంధనం తయారు చేయవచ్చంటున్న పరిశోధకులు
విస్కీ వ్యర్థంతో ఇంధనం తయారు చేయవచ్చని చెబుతున్నారు స్కాటిష్ శాస్త్రవేత్తలు. స్కాట్‌లాండ్‌లో అత్యంత విలువైన పరిశ్రమలు ఉత్పత్తి చేసే విస్కీ వ్యర్థాలను, దాని ఉపఉత్పత్తులను వృధా పోనీకుండా వాటి నుండి తర్వాతి తరం జీవఇంధనం (నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయెల్)ను తయారు చేసేందుకు ఓ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
సెల్టిక్ రెన్యువబల్స్ అనే సంస్థ, దశాబ్ధ కాలం క్రితం ఉపయోగించిన ఫర్మెంటేషన్ (కిన్వప్రక్రియ)ను ఆధారంగా చేసుకొని, మరింత రీఫైన్డ్ ప్రక్రియ ద్వారా విస్కీ వ్యర్థాల నుంచి జీవఇంధనాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికన్ కెమికల్ సొసైటీ యొక్క వారపత్రిక కెమికల్ అండ్ ఇంజనీరింగ్ న్యూస్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, సెల్టిక్ ఓ కమర్షియల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విస్కీ తయారులో వచ్చే ఉపపదార్థాలైన డ్రాఫ్, పాట్ ఏల్‌లకు ఎలాంటి వాణిజ్య విలువ ఉండదని, ప్రస్తుతం ఇవి పెద్ద డిస్పోజల్ ఇష్యూగా పరిణమిస్తున్నాయని ఈడిన్‌బర్గ్‌కు చెందిన సెల్టిక్ రెన్యువబల్స్ ఛీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ఫౌండర్, ప్రెసిడెంట్ మార్టిన్ టాంగెనీ చెప్పారు.

విస్కీ తయారీలో ముఖ్యంగా మూడు పదార్థాల (నీరు, ఈస్ట్, గ్రెయిన్ - ప్రధానంగా బార్లీ)ను ఉపయోగిస్తారు. వీటిలో కేవలం 10 శాతం మాత్రమే విస్కీగా మారుతుంది, మిగిలిన 90 శాతం వ్యర్థంగా మారుతుంది. ప్రతి ఏటా ఈ పరిశ్రమ 5 లక్షల మెట్రిక్ టన్నుల డ్రాఫ్‌ను, 1.6 బిలియన్ లీటర్ల పాట్ ఏల్‌ను ఉపఉత్పత్తులను తయారు చేస్తుందని అంచనా.
సాధారణంగా ఈ ఉప ఉత్పత్తులను వ్యవసాయ భూముల్లో చల్లడం, తక్కువ గ్రేడ్ జంతు ఆహారంగా మార్చడం లేదా సముద్రంలో విడుదల చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, సదరు ఉపఉత్పత్తులను వృధాగా పోనివ్వటానికి బదులుగా వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే, వీటి ద్వారా ఇథనాల్ లేదా 1-బటనాల్‌లను తయారు చేసుకునే అవకాశం ఉంటుందని సెల్టిక్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








