వీక్ బాడీ డాట్సన్ గో కారులో ఎయిర్‌బ్యాగ్ పెట్టినా సేఫ్టీ ఉండదు!

By Ravi

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తమ బడ్జెట్ కార్ బ్రాండ్ క్రింద ప్రవేశపెట్టిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్‌సిఏపి) క్రాష్ టెస్టులో జీరో రేటింగ్‌ను దక్కించుకున్న విషయం తెలిసినదే. ఈ క్రాష్ టెస్టులో కారు సర్టిఫై అవ్వాలంటే, సదరు కారులో కనీసం ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లయినా ఉండాలి. కానీ డాట్సన్ గో కారులో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్లు టాప్-ఎండ్ వేరియంట్‌లో సైతం ఆప్షనల్‌గా కూడా లభ్యం కావు.

మరో వైపు డాట్సన్ గో బాడీ నిర్మాణం చాలా నాసిరకంగా ఉందని, యాక్సిడెంట్‌లను ఈ కారు సమర్థవంతంగా ఎదుర్కోలేదని గ్లోబల్ ఎన్‌సిఏపి సర్టిఫై చేసింది. ఈ విషయంపై, నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గుయ్‌లౌమ్ సికర్డ్ స్పందిస్తూ.. భారతదేశంలో కావల్సిన స్థానిక వాహన నియంత్రణలను డాట్సన్ గో సంతృప్తి పరుస్తుందని, టాప్-ఎండ్ వేరియంట్ గో కారులో కూడా ఏబిఎస్ లేదా ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు లేవని, గ్లోబల్ ఎన్‌సిఏపి రిపోర్ట్ తర్వాత తమ లో-కాస్ట్ కారులో ఎయిర్‌బ్యాగ్‌ను ఆఫర్ చేయాలని యోచిస్తున్నామని అన్నారు.


అయితే, గ్లోబల్ ఎన్‌సిఏపి సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ మాత్రం.. అసలు డాట్సన్ గో కారు బాడీ నిర్మాణమే చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఇందులో ఎయిర్‌బ్యాగ్ ఆఫర్ చేసినా పెద్ద ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. నిస్సాన్ 2014లో డాట్సన్ గో లాంటి మోడల్‌ను విడుదల చేయటం చాలా నిరుత్సాహకరమని ఆయన అన్నారు. గ్లోబల్ ఎన్‌సిఏపి రిపోర్ట్ ప్రకారం, గో కారులో ఎయిర్‌బ్యాగ్ ఆఫర్ చేసినా, సేఫ్టీ పరంగా పెద్ద ప్రయోజనం ఉండదని సమాచారం.

క్రాష్ టెస్ట్‌కు ఉపయోగించిన డాట్సన్ గో కారులో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లు లేవు. క్రాష్ టెస్టులో కారు ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది (పై ఫొటోలో చూడొచ్చు). ఇందులో ఉంచి డమ్మీల తలకు, కాలికి తీవ్రమైన గాయాలు నమోదయ్యాయి. ఫలితంగా ఇది గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో జీరో రేటింగ్‌ను దక్కించుకుంది.

Datsun Go

ఇదిలా ఉండగా.. భారతదేశంలో తయారై, ఇక్కడి మార్కెట్లో విక్రయించబడుతున్న కార్లకు కూడా క్రాష్ టెస్ట్‌ని నిర్వహించాలని భారత సర్కారు యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఇండియన్ ఎన్‌సిఏపి 2016 నాటికి ఏర్పాటు కానుంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారతదేశంలో తయారైన ప్రతి కారు కూడా ఈ టెస్ట్‌లో పాస్ కావల్సిన అవసరం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 4, 2014, 15:54 [IST]
English summary
Global NCAP Secretary General, David Ward said “Datsun Go body structure so weak that is pointless to fit an airbag.” Mr. Ward added that it was “disappointing” to see Nissan launch a model like the Datsun Go in 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+