వరల్డ్ కప్ ఫైనల్ గోల్‌ను తిరిగి సృష్టించిన ఫోక్స్‌వ్యాగన్
ఆద్యంతం ఉఠ్కంతతో సాగిన ఫిఫా 2014 ఫైనల్స్ మ్యాచ్‌లో జర్మనీ 1-0 పాయింట్లతో వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసినదే. జర్మనీ దేశం ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సందర్భంగా ఆ దేశం యావత్తు సంబరాల్లో మునిగిపోయింది. ఈ సంబరాన్ని పురస్కరించుకొని ఆదేశపు ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కూడా తమదైన రీతిలో ఈ విజయాన్ని జరుపుకుంది.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్లను వైర్లు లేకుండా చార్జ్ చేసుకోవచ్చు!
ఇందులో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ ఆఖరి మ్యాచ్‌లోని చివరి గోల్‌ను ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్లతో విర్చ్యువల్ గ్రాఫిక్స్ రూపంలో రీక్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్లతో ఫైనల్ గోల్‌ను చేయటాన్ని మనం చూడొచ్చు. ఇదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో చేసినప్పటికీ, చూడటానికి ఇది సరదాగా ఉంటుంది.
ఇందులో మొత్తం 22 విర్చ్యువల్ ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ కార్లతో మారియో గోట్జ్ చేసిన రీతిలో ఈ కార్లు కూడా గోల్ చేసినట్లుగా వీడియోని తయారు చేశారు. జర్మనీ మీద తమకున్న అభిమానాన్ని చాటుకుంటూనే ఫోక్స్‌వ్యాగన్ తమ కార్లను కూడా మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేసింది. మరి ఆ అద్భుతమైన వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/xwiOorAMQEo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








