మారుతి సుజుకి కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్స్
సరసమైన ధరకే కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. మరికొద్ది రోజుల్లో పాత సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపులను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి.
ఇప్పటికే అనేక కార్ కంపెనీలు, డీలర్లు వాహనాలపై మంచి డీల్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

మారుతి సుజుకి అందిస్తున్న డీజిల్ వెర్షన్ స్విఫ్ట్ కారుపై కంపెనీ రూ.30,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, కంపెనీ అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ మోడల్‌పై కంపెనీ రూ.45,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది.
ఇంకా కంపెనీ విక్రయిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌పై ఏకంగా రూ.75,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఆల్టో మోడల్‌పై రూ.55,000 విలువైన ప్రయోజనాలను మారుతి సుజుకి అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత మారుతి సుజుకి డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








