2015 సంవత్సరానికి 15 మోడల్స్‌ను విడుదల చేసిన మెర్సిడెస్-బెంజ్.
ఇండియాలో లగ్జరీ కార్ల సెగ్మంట్లో మెర్సిడెస్-బెంజ్ తనని తాను లీడర్ అని నిర్ణయించుకుంది. ఈ సంవత్సరం 2015 అనే నెంబర్ ఉందని ఆ నెంబర్‌కు అనుగుణంగా మెర్సిడెస్-బెంజ్ 15 మోడళ్లను భారత్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇంత వరకు 13 మోడళ్లను విడుదల చేస్తూ వచ్చింది.
ఇక రెండు మోడళ్లను విడుగదల చేయాల్సి ఉంది. ఆ రెండు మోడళ్లు ఎలా ఉండబోతున్నాయో అని మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. మిగిలిన రెండు మోడళ్లకు సంభందించిన సమాచారం త్వరలోనే తెలియనుంది. అయితే వాటి విడుదల తేది వరకు మనం ఎదురుచూడాల్సిందే.
మీ నగరంలో మీకు నచ్చిన కారు యొక్క ఆన్-రోడ్ ధరను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంత వరకు విడుదల చేసిన 13 మోడల్స్‌కు చెందిన టెక్నిల్ వివరాలు మరియు ధరల గురించి ఓలుక్కేసుకుందాం పదండి.

1. జియల్‌ఇ :
భారత దేశంలో ఈ సంవత్సరం మెర్సిడెస్-బెజ్ 13వ మోడల్ గా విడుదల చేసిన కారు జియల్‌ఇ యస్‌యువి ఇది పూర్తిగా ఫేస్ లిఫ్ట్ వర్షెన్ దీనిని ఎమ్‌యల్-క్లాస్ నమూనాతో రూపొందించారు. అయితే ఇప్పటికే యమ్‌యల్-క్లాస్ కార్లు భారత్‌లో అమ్ముడుపోతున్నాయి. ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు 4-మ్యాటిక్ అన్ని చక్రాలకు డ్రైవ్‌ని అందిస్తుంది. ఇందులో 250డి మరియు 350డి అను రెండు ఇంజన్ ఆప్షన్స్‌లలో లభిస్తోంది.
- మెర్సిడెస్-బెంజ్ జియల్‌ఇ250డి ధర రూ. 68,76,256.
- మెర్సిడెస్-బెంజ్ జియల్‌ఇ350డి ధర రూ. 81,54,147.
- మెర్సిడెస్-మేబ్యాక్ యస్500 ధర రూ. 1,94,605.
- మెర్సిడెస్-మేబ్యాక్ యస్600 ధర రూ. 3,02,04,524.
- మెర్సిడెస-బెంజ్ సియల్ఎ-క్లాస్(డీజల్) ధర రూ. 36,00,207.
- మెర్సిడెస-బెంజ్ సియల్ఎ-క్లాస్(పెట్రోల్) ధర రూ. 37,73,536.
- మెర్సిడెస్-బెంజ్ సి220 సిడిఐ (డీజల్) ధర రూ. 43,74,585.
- మెర్సిడెస్-బెంజ్ బి-క్లాస్(డీజల్) ధర రూ. 35,16,935.
- మెర్సిడెస్-బెంజ్ బి-క్లాస్(పెట్రోల్) ధర రూ. 33,28,190.
- మెర్సిడెస్-బెంజ్ ఇ 400 క్యాబ్రియోలెట్ ధర రూ. 89,56,975.
- మెర్సిడెస్-బెంజ్ సియల్‌యస్ 250 సిడిఐ(డీజల్) ధర రూ. 87,39,227
- మెర్సిడెస్-బెంజ్ యస్600 గార్డ్ ధర రూ. 10,12,742.
- మెర్సిడెస్-బెంజ్ యస్500 కూపె ధర రూ. 2,27,93,114
- మెర్సిడెస్-బెంజ్ ఎయమ్‌జి యస్63 కూపె ధర రూ. 2,96,13,430.
- మెర్సిడెస్-ఎయమ్‌జి యస్ 63 సెడాన్ ధర రూ. 2,88,17,726.
- మెర్సిడెస్-ఎయమ్‌జి జి63 క్రేజి కలర్ ధర రూ. 2,47,25,537.
- మెర్సిడెస్-ఎయమ్‌జి సి63 యస్ ధర రూ. 1,48,36,079.

2.మెర్సిడెస్-మేబ్యాక్ :
మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ వెర్షన్‌లను విడుదల చేయాలని ఇక పూర్తిగా నిర్ణయించుకుంది. అందులో భాగంగానే మెర్సిడెస్-మేబ్యాక్ యస్600 మరియు యస్500 కార్లను విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కార్లు భారత మార్కెట్లో అసాధారణ స్పందనలను పొందుతోంది. ఆరోజు నుండే యస్500 అమ్మబడింది.

3. సియల్ఎ :
లగ్జరీ కార్లలో సెడాన్‌కు చక్కటి నిర్వచనం ఎ-క్లాస్, సియల్‌ఎ కారు పూర్తిగా ఫ్రంట్ డ్రైవతో నడుస్తుంది. మరియు ఇందులో ఉన్న ఎ-, బి- మరియు జియల్‌ఎ-క్లాస్ అన్ని కూడా ఒకే తోడ్పాటును పంచుకుంటాయి. దీని పూర్తిగా భారతీయులను దృష్టిలో పెట్టుకుని తయారుచేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కు వగానే ఉంటుంది. ఇది డీజల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది.

4. సి220 సిడిఐ :
మెర్సిడెస్-బెంజ్ సి220 సిడిఐ ఇండియాలో విడుదల చేసిన అత తక్కువ కాలంలోనే, భారతీయుల దీనిని ఎక్కుగా ఇష్టపడుతున్నందువల్ల ఈ మోడల్ కారును దేశీయంగా చకన్ లో దీని తయారీని మొదలుపెట్టారు. ఈ కారు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

5. బి-క్లాస్ :
సరి కొత్త బి-క్లాస్ కారును పూర్తిగా ఆధునీకరించబడిన ఫీచర్లు మరియు ఎక్స్‌టీరియర్‌తో విడుదల చేశారు. ఇది చిన్న ఫ్యామిలీలకు ఎంతో అనువుగా మరియు విలాసవంతంగా ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‍లలో లభించును.

6.ఇ-క్లాస్ క్యాబ్రియోలెట్ :
జర్మన్ కార్ల తయారి సంస్థ నుండి కన్వర్టబుల్ మోడల్ కారు ఇది ఒక్కటే ఈ కొత్త మెర్సిడెస్-బెంజ్ ఇ 400 క్యాబ్రియోలెట్ కారు చూడటానికి ఎంతో అత్భుతంగా ఉంటుంది. కేవలం రెండు డోర్లు మాత్రమే ఉన్న ఈ పెట్రోల్ వెర్షన్ కారు తన టర్బోఛార్జ్‌డ్ వి6 ఇంజన్ నుండి 333 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

7. సియల్‌యస్ 250 సిడిఐ :
మెర్సిడెస్-బెంజ్ తన సియల్‌యస్ 250 కార్లను భారతీయులకు డీజల్ వేరింట్లో మాత్రమే అందివ్వాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ప్రస్తుంతం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే వి6 ఇంజన్ అందుబాటులో ఉండేది.

8. యస్600 గార్డ్ :
దీని ధర ఎక్కువ అనిపించవచ్చు. కాని ఎవరైనా మీద దాడికి ప్రయత్నించినపుడు, ఆయుధాలతో దాడి చేసినపుడు మీ పరిస్తితి ఏమిటి? అందుకే ఇందులో కారుకు కుడివైపున ఉన్న విఆర్9 స్థాయి భద్రతను ఇందులో కల్పించారు. ఇది దేశంలో ఉన్న రాజకీయ నాయకులను మరియు వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు.

9.యస్500 కూపె :
మెర్సిడెస్-బెంజ్ యస్500 కూపె కారును యస్63 ఎయమ్‌జి కూపెతో పాటుగా విడుదల చేశారు. ఈ యస్500 కూపెలో 4.7-లీటర్, ట్విన్ టర్బో, వి8 ఇంజన్ కలదు ఇది 453 బిహెచ్‌పి మరియు 700 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

10. మెర్సిడెస్-ఎయమ్‌జి యస్63 కూపె :
ఈ యస్63 కూపె కారు యస్500 పాటుగా విడుదల చేశారు. ఇందులో 5.5-లీటర్, ట్విన్ టుర్బో. వి8 ఇంజన్ కలదు ఇది 577 బిహెచ్‌పి మరియు 900 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

11. మెర్సిడెస్-ఎయమ్‌జి యస్ 63 సెడాన్ :
ఒక సారి ఆలోచించండి యస్-క్లాస్ మోడల్స్‌లో ఎన్ని కార్లను విడుదల చేస్తుందో. ఈ యస్63 సెడాన్ మాత్రం నాలుగు డోర్లను కలిగి ఉంది. ఇందులో 5.5-లీటర్ బిటర్బో వి8 ఇంజన్ ఉంది. ఇది 585 బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

12. ఎయమ్‌జి 63 క్రేజి కలర్ :
మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ వెహికల్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. యస్.యు.వి గా ఉన్నఅన్ని వెహికల్స్ పోటిగా నిలవాలనే మెర్సిడెస్ ఇలా క్రేజీ కలర్ అనే పేరు పెట్టింది. మరియు అలాంటి కలర్ ఆప్షన్‌లోనే వీటిని అందిస్తోంది.

13. మెర్సిడెస్-ఎయమ్‌జి సి63 యస్ :
మెర్సిడెస్-ఎయమ్‌జి సి63 యస్ చాలా వేగవంతమైనది ఇది కేవలం నాలుగు సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, దీని అత్యధిక వేగం గంటకు 250 కిలోమీటర్లు. మరియు ఇందులో గల 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజన్ 503 బిహెచ్‌పి మరియు 714 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇందులో 7-స్పీడ్ ఎయమ్‌జి స్పీడ్ షిఫ్ట్ గేర్‍బాక్స్ కలదు.
(అన్ని ధరలు ఆన్-రోడ్,ఎక్స్-షోరూమ్,డిల్లీ).


Click it and Unblock the Notifications








