2015 నంది హిల్ క్లైంబ్ ప్రారంభం.. లేటెస్ట్ అప్‌డేట్స్

By Ravi

బెంగుళూరు బైక్, కార్ రేస్ ప్రియులను అలరించేందుకు 'నంది హిల్ క్లైంబ్' సిద్ధమైంది. బెంగుళూరుకి చెందిన టీమ్ ఇన్నర్‌లైన్ రేసింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన నంది హిల్స్ వద్ద నిర్వహిస్తోంది. జనవరి 21వ మోటార్‌సైకిల్ రేస్ జరగనుండగా, జనవరి 22న కార్ రేస్ జరుగుతుంది.

ఈ 2015 నంది హిల్ క్లైంబ్ రేస్‌లో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంటుంది. నంది హిల్ క్లైంద్ రేస్‌లో రేసర్లు కొండ క్రింది భాగం నుంచి 1.6 కిలోమీటర్ల పొడవు ఉన్న, మలుపులతో కూడిన రోడ్డుపై అతి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరు త్వరగా గమ్యం చేరుకుంటే వారే విజేతగా నిలుస్తారు.

నంది హిల్ క్లైంబ్ రేస్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 నంది హిల్ క్లైంబ్

నంది హిల్ క్లైంబ్ ఈవెంట్ జనవరి 20 నుంచి 22 వరకు జరుగుతుంది. జనవరి 20వ తేదీన రేస్ నిర్వాహకులు కార్లు, బైకుల కోసం ప్రాక్టీస్ సెషన్లను నిర్వహించారు.

2015 నంది హిల్ క్లైంబ్

ప్రాక్టీస్ సెషన్‌లో.. మోడిఫైడ్ గేర్‌లెస్ స్కూటర్లు, యమహా ఆర్ఎక్స్, ఆర్‌డి350, రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి ఫియరో, కెటిఎమ్, కరిజ్మా మొదలైన టూవీలర్లు అలాగే, ఆల్టో, మారుతి జెన్, ఎస్టీమ్, సిటీ మొదలైన కార్లు ఈ రేస్‌లో పరుగులు తీశాయి.

2015 నంది హిల్ క్లైంబ్

రెగ్యులర్ రేస్ జరగనున్న ఈ రెండు రోజుల పాటు సాధారణ పబ్లిక్ కోసం ఈ రోడ్డును బ్లాక్ చేసి ఉంచుతారు. ఈ సమయంలో పై నుంచి ట్రాఫిక్ క్రిందికి రావటం జరగదు. రేస్ జరిగే సమయంలో ఏదైనా దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంటే, వెంటనే స్పందించేందుకు మెడికల్ క్రూ కూడా అందుబాటులో ఉంటుంది.

2015 నంది హిల్ క్లైంబ్

నంది హిల్ క్లైంబ్ రేసులో కార్ల కన్నా ఎక్కువగా మోటార్‌సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రేస్ కోసం బైక్‌ను తేలికగా ఉంచేందుకు రైడర్లు తమ మోటార్‌సైకిళ్లను ప్రత్యేకంగా మోడిఫై చేయించుకుంటారు. అలాగే కార్లను కూడా మోడిఫై చేస్తారు. ఈ రేస్ వెర్షన్ల నుంచి వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్ వింటే ఎలాంటి రేస్ ప్రియులకైనా తాము కూడా ఇందులో భాగం పంచుకోవాలనిపిస్తుంది.

2015 నంది హిల్ క్లైంబ్

నంది హిల్ క్లైంబ్ 2015 కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం మినిట్-టూ-మినిట్ కవర్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 20, 2015, 19:00 [IST]
English summary
It's time for for drivers to joke, two-strokes to smoke, and modifications, bespoke. That's because the hour of the 2015 Nandi Hill Climb has dawned. The practice session currently underway on the 1.6-kilometre course that winds its way up to the top of the popular tourist attraction, Nandi Hills.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+