2016 ఆటో ఎక్స్‌ఫో తేదీలు ఖరారు
ఈ రోజుల్లో మోటార్ షోలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా భారత్ కూడా ఆటో ఎక్స్‌ఫో పేరిట మోటార్ షోను నిర్వహిస్తోంది. దీన్ని రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు.
2016 ఆటో ఎక్స్‌ఫో తేదీలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో 2016 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను 2016 ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు.

ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌ఫో మార్ట్ మరియు సెంటర్‌లో, ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను ప్రగతి మైదాన్‌లోను నిర్వహించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 2014లోను ఇవే ప్రాంతాల్లో ఆటో ఎక్స్‌ఫోను నిర్వహించారు.
క్రిందటి ఆటో ఎక్స్‌ఫోలో ఇండియా నుంచి 44 ఆవిష్కరణలు జరగగా, ప్రపంచానికి 26 మోడళ్లు పరిచయం చేయబడ్డాయి. సుమారు రోజుకు 1,00,000 మంది ప్రేక్షకులు ఈ ఆటో ఎక్స్‌ఫోకు విచ్చేసి, దేశంలోనే నంబర్1 షోగా తయారుచేసారు.

2014 ఆటో ఎక్స్‌ఫోలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు 300 వాహనాలను డిస్ల్పేలో ఉంచారు. వీటితో పాటు 20 ద్వి-చక్రవాహనాలను కూడా డిస్ల్పేలో కనిపించే విధంగా ఏర్పాటుచేశారు.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








