2015 జెనీవా ఆటో షోలో దర్శనమివ్వనున్న 2016 రేంజ్ రోవర్ ఎవోక్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ అందిస్తున్న పాపులర్ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ ఎవోక్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అతికొద్ది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించున్న ఇందులో ఓ 2016 వెర్షన్‌ను ల్యాండ్ రోవర్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది.

మార్చ్ నెలలో జరగనున్న 2015 జెనీవా అంతర్జాతీ ఆటో షోలో ల్యాండ్ రోవర్ తమ 2016 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను బట్టి చూస్తుంటే, కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఫ్రంట్ డిజైన్‌లో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. బంపర్ మొదలుకొని హెడ్‌లైట్ల వరకూ పూర్తిగా కొత్త డిజైన్ ఫీచర్లు కనిపించనున్నాయి.

2016 Range Rover Evoque

ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా రేంజ్ రోవర్ ఎవోక్ కార్లు అమ్ముడుపోయాయని, ఐకానిక్ ఎవోక్ డిజైన్‌ను మార్చకుండా, కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేయటం పెద్ద సవాలుతో కూడుకున్నదని, కొత్తగా చేసిన డిజైన్ రిఫ్రెష్‌మెంట్స్ కారణంగా సరికొత్త 2016 రేంజ్ రోవర్ ఎవోక్ మరింత అందంగా ఉండబోతుందని ల్యాండ్ రోవర్ డిజైన్ డైరెక్టర్, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గేరీ మెక్‌గవర్న్ తెలిపారు.

కొత్త 2016 రేంజ్ రోవర్ ఎవోక్ ఫీచర్లు:

  • ఫుల్ ఎల్ఈడి అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్
  • డిస్టింక్టివ్ హెడ్‌ల్యాంప్ గ్రాఫిక్స్
  • కొత్త ఇంజన్ ఆప్షన్స్
  • కొత్త సేఫ్టీ, కన్వీనెన్స్ ఫీచర్స్
  • ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్

More from DriveSpark

Article Published On: Monday, February 16, 2015, 14:30 [IST]
English summary
Land Rover today revealed the first teaser glimpse of the new 2016 Range Rover Evoque. Land Rover showed the new headlamp signature for the most successful Land Rover has produced.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+