21 గన్ సెల్యూట్ ర్యాలీ: 1957 షెవర్లే బెల్ ఎయిర్ కన్వర్టిబల్
పురాతన కార్లకు ఉండే ప్రత్యేకతే వేరు. అందులోనూ అమెరికాకు చెందిన పురాతన కార్లంటే, ఇంకా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద ఆకారంలో, అప్పట్లో విలాసానికి ప్రతీకగా మారిన కార్లను చూస్తే, ఇప్పటి వారు సైతం మనసు పారేసుకోవాల్సిందే. అలాంటి పురాతన కార్లలో ఒకటి ఈ అమెరికన్ మోడల్.
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్‌కి షెవర్లే బ్రాండ్‌లో వచ్చిన 1957 షెవర్లే బెల్ ఎయిర్ మోడల్ ఇది. ఈ మోడల్‌ను స్కెచ్ రూపంలో మీకు పరిచయం చేస్తున్నది మా డ్రైవ్‌స్పార్క్ ఎడిటర్ సంతోష్ రాజ్‌కుమార్. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 21 గన్ సెల్యూట్ వింటేజ్ కార్ ర్యాలీని పురస్కరించుకొని ఈ కారును స్కెచ్ చేయటం జరిగింది.
ఇక ఈ 1957 షెవర్లే బెల్ ఎయిర్ విషయానికి వస్తే.. ఆల్-టైమ్ అమెరికన్ ఫేవరేట్ కార్లలో ఒకటైన బెల్ ఎయిర్‌ను 1950 నుండి 1981 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. ఈ కారు ఉత్పత్తిలో ఉన్న సమయంలో ఇందులో అనేక మోడళ్లు, స్టైలింగ్ మార్పులు వచ్చాయి. అయితే, అన్నింటి కన్నా ఫేవరేట్‌గా నిలిచింది మాత్రం ఈ 1957 షెవర్లే బెల్ ఎయిర్ మాత్రమే.

ఈ కారు 2-డోర్ హార్డ్‌టాప్, 2-డోర్ కూపే, 4-డోర్ సెడాన్, 4-డోర్ స్టేషన్ వ్యాగన్, 2-డోర్ కన్వర్టిబల్ వంటి బాడీ స్టయిల్స్‌లో లభ్యమయ్యేది. ఇందులో 6-సిలిండర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో 3.9 లీటర్, 5.7 లీటర్ ఇంజన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండేవి.
షెవర్లే బెల్ ఎయిర్ కారులో ఉపయోగించిన ఇంజన్లు 145 నుంచి 315 బిహెచ్‌పిల రేంజ్‌లలో పవర్‌ను ప్రొడ్యూస్ చేసేవి. అప్పట్లోనే ఇది 2-స్పీడ్ పవర్‌గ్లైడ్ ఆటో బాక్స్ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించేంది. అలాగే 3-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉండేది. అప్పట్లో అత్యంత సుందరమైన కార్లలో షెవర్లే బెల్ ఎయిర్ ఒకటిగా ఉండేది.


Click it and Unblock the Notifications