21గన్ సెల్యూట్ కార్ ర్యాలీ గురించి తెలుకోవాల్సిన 10 విషయాలు

భారతదేశంలో కెల్లా అత్యంత విలువైన పురాతన కార్స్ అండ్ బైక్స్ ర్యాలీ '21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ' ఫిబ్రవరి 21, 22వ తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసినదే. ఈ ఆటో షోకి మా డ్రైవ్‌స్పార్క్ అధీకృత మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

గడచిన నాలుగేళ్లుగా 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరగనున్నది ఐదవ ఎడిషన్. ఈ షోలో 51 మహారాజుల కార్లతో పాటు మొత్తం 201 అత్యంత అరుదైన పురాతన కార్లు, 50 పురాతన బైక్‌లను వీక్షకుల సందర్శనార్థం ఉంచనున్నారు.

ఈ 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ గురించి తెలుసుకోవాల్సిన 10 విషయంలో ఈ కథనంలో చూడండి.

21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ

21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ ఫిబ్రవరి 21 మరియు 22, 2015వ తేదీలలో న్యూఢిల్లీలో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పురాతన కార్ల ప్రదర్శనతో పాటుగా ఓ ర్యాలీని కూడా నిర్వహిస్తారు.

ర్యాలీ రూట్

ర్యాలీ రూట్

పురాతన కార్లతో నిర్వహించే ఈ ర్యాలీ ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి ప్రారంభమై దాదాపు 52 కిలోమీటర్లు ప్రయాణించి గుర్గావ్‌వోని లీజర్ వ్యాలీ పార్క్ వద్ద ముగుస్తుంది.

మహారాజుల కార్లు

మహారాజుల కార్లు

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా 51 మహారాజుల కార్లను ఒకేచోట చూసే అవకాశం దక్కనుంది.

ఫొటోలు:

1. హెచ్‌హెచ్ మహరాణా మాన్వీంద్ర సింగ్ ఆఫ్ బర్వానీ

2. హెచ్‌హెచ్ మహరాణా ఛత్రపతి సాహు 2 భోంస్లే

3. మహరాణా శ్రీజీ అర్వింద్ సింగ్ మెవార్

4. హెచ్‌హెచ్ మహరాణా రావోల్ శ్రీ విజయరాజసింహ్జి వీరభద్రసింహ్జి

అత్యంత అరుదైన కార్లు

అత్యంత అరుదైన కార్లు

దేశంలోని దాదాపు 3500 వింటే కార్లలో నుంచి అత్యంత అరుదైన, విలువైన కార్లను ఎంపిక చేసి ఈ షోకి తీసుకురానున్నారు. కేవలం భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశాల్లో ఉన్న వింటేజ్ కార్లను కూడా సింగుపూర్ అండ్ మలేషియా వింటేజ్ కార్ క్లబ్ ఇక్కడి తీసుకురానుంది.

ఈ షో వెనుక సూత్రధారి

ఈ షో వెనుక సూత్రధారి

21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీని గుర్గావ్‌కి చెందిన డెనెబ్ అండ్ పొల్యూక్స్ అనే కార్ రెంటల్ కంపెనీ ఎండి మదన్ మోహన్ నిర్వహిస్తున్నారు. ఈయనకు పురతన కార్లంటే మహా క్రేజ్. హెరిటేజ్ మోటారింగ్ క్లబ్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

న్యాయ నిర్ణేతలు

న్యాయ నిర్ణేతలు

ఈ 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీలో బెస్ట్ కారును ఎంచుకునేందుకు ఓ జ్యూరీ ప్యానెల్ కూడా ఉంది. వీరిలో బర్వానీ 58వ మహారాజు హెచ్‌హెచ్ మహరాణా మాన్వీంద్ర సింగ్ జీ (ఛీఫ్ జడ్జ్), వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ దొస్సా, సినీ నిర్మాత రాజా ముజఫర్ అలీ తదితరులు ఉంటారు.

బహుమతి

బహుమతి

ఈ ఏడాది 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీలో బహుమతులకు సంబంధించి అనేక విభాగాలు ఉంటాయి. అందులో గెస్ట్ చాయిస్, బెస్ట్ ఆఫ్ ది షో, బెస్ట్ మెయింటైన్డ్, ఓల్డెస్ట్ వింటేజ్ కారు మొదలైన విభాలున్నాయి.

కళా ప్రదర్శన

కళా ప్రదర్శన

ఈ ఏడాది 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీలో కేవలం పురాతన కార్లే కాకుండా వివిధ కళలను కూడా ప్రదర్శించనున్నారు. సంగీతం, ఫ్యాషన్ షో, గజల్స్ మొదలైనవి ఉంటాయి.

టికెట్స్

టికెట్స్

షోకి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. బుక్‌మైషో డాట్‌కామ్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

మరింత గ్రాండ్‌గా..

మరింత గ్రాండ్‌గా..

ఈ ఏడాది 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీని మునుపటి కన్నా మరింత గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, February 5, 2015, 15:47 [IST]
English summary
If you're into vintage automobiles, then you must make it a point to somehow get to Delhi and Gurgaon for the two days of the fifth edition of the 21 Gun Salute Vintage Car Rally. The event promises to be bigger and better this year, with unprecedented participation expected.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+