అరుదైన భారత మహారాజుల కార్లను చూడాలనుకుంటున్నారా?
భారతదేశంలో కెల్లా అత్యంత విలువైన పురాతన కార్స్ అండ్ బైక్స్ ర్యాలీ '21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ' ఫిబ్రవరి 21, 22వ తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసినదే. ఈ ఆటో షోకి మా డ్రైవ్‌స్పార్క్ అధీకృత మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మేము ఢిల్లీ నుంచి ప్రత్యక్షంగా కవర్ చేయనున్నాము.
ఐదవ ఎడిషన్ 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ 1936 డైమ్లర్ స్పోర్ట్స్ కూపే, 1952 డైమ్లర్ డిబి 18 డిహెచ్‌సి, 1946 లింకోన్ కాంటినెంటల్, 1935 అవాన్ డిహెచ్‌సి, 1929 బుయిక్ కన్వర్టిబల్, 1930 ప్యాకర్డ్ 733 వంటి కార్లు దర్శనమివ్వనున్నాయి. అంతేకాకుండా.. 51 మహారాజుల కార్లతో పాటు మొత్తం 201 అత్యంత అరుదైన పురాతన కార్లు మరియు 50 పురాతన బైక్‌లను వీక్షకుల సందర్శనార్థం ఉంచనున్నారు.

దేశంలోని దాదాపు 3500 వింటే కార్లలో నుంచి అత్యంత అరుదైన, విలువైన కార్లను ఎంపిక చేసి ఈ షోకి తీసుకురానున్నారు. కేవలం భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశాల్లో ఉన్న వింటేజ్ కార్లను కూడా సింగుపూర్ అండ్ మలేషియా వింటేజ్ కార్ క్లబ్ ఇక్కడి తీసుకురానుంది. ఈ పురాతన కార్ల ప్రదర్శనతో పాటుగా ఓ ర్యాలీని కూడా నిర్వహించనున్నారు.

ఈ ర్యాలీ ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి ప్రారంభమై దాదాపు 52 కిలోమీటర్లు ప్రయాణించి గుర్గావ్‌వోని లీజర్ వ్యాలీ పార్క్ వద్ద ముగుస్తుంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. బుక్‌మైషో డాట్‌కామ్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








