పెట్రోల్, డీజల్ బదులుగా జస్ట్ రూ.10 లతో మీ కారుకు, మీరే స్వంతంగా ఇంధనం తయారుచేసుకోవచ్చు....
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లి కారును కోరుకుంటున్నారు ఈ ఆలోచన రోజురోజుకి పెద్దది అవుతోంది. భారతీయ మరియు ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లు అన్ని కూడా ఈ తరహా కార్లను ప్రవేశపెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాకార్ల వలన ఉన్న ఏకైక లాభం కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
మధ్యప్రధేశ్‌లోని ఒక కారు మెకానిక్ కేవలం పది రుపాయలు విలువ చేసే కారు ఇంధనాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. మరి ఈ మధ్య ప్రదేశ్ మెకానిక్ ఈ ఇంధనాన్ని ఎలా తయారు చేశాడు? దీనిని మనం కూడా తయారు చేసుకోవచ్చా? అసలు అతను ఎన్ని రోజులు దీని మీద ప్రయోగం చేశాడు? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా ?
మరిన్ని ఆసక్తికరమైన వివరాలకు: అత్యంత ప్రజాదరణ పొందినన రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మీ కోసం
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింద కథనాల ద్వారా తెలుసుకుందాం......

ఇతను ఎవరు :
ఇతని పేరు రయీస్ మార్కాని, వయస్సు 44 సంవత్సరాలు. ఇతను మధ్యప్రదేశ్‌లో ఒక కారు మెకానిక్. ఈ విభిన్న ప్రయోగానికి ఆజ్యం పోసింది ఇతనే.

ఇంధనం తయారి విధానం :
మార్కని ఈ అతి చవకైన ఇంధనాన్ని తయారు చేసిన విధానం కాల్షియం కార్బైడ్ అను రసాయన మూలకాన్ని పెద్ద పరిమాణంలో నీటితో కలుపుతాడు. ఆ తరువాత ఆ కాల్షియ కార్బైడ్ నీటితో రసాయన చర్య జరిపి అసిటలిన్ గ్యాస్ తయారవుతుంది. ఇలా తయారైన దానిని నేరుగా ఇంధన ట్యాంక్‌లోకి పంపించి వాహనాన్ని ప్రయోగాత్మకంగా నడిపిచూపించాడు.

ఇతర అవసరాల కోసం :
ఈ అసిటలిన్ గ్యాస్‌ని మరిన్ని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తారు ముఖ్యంగా వెల్డింగ్ మరియు పోర్టబుల్ లైట్లలో దీనిని ఉపయోగిస్తారు.

ఎంత సమయం పట్టింది :
రయీస్ మార్కని ఎప్పూడూ ఏదో ఒక దానిని కనిపెట్టలాని ప్రయత్నిస్తూనే ఉండేవాడు ఆ ప్రయత్నంలో భాగంగానే దీనిని తయారు చేశానని చెప్పుకొచ్చాడు. దాదాపుగా ఆరు నెలల ప్రయోగానంతంరం ఈ ప్రయోగం విజయవంతమైందని వివరించాడు.

ధర :
ఇది ఎంతో తక్కువ ధరకే మనకు లభిస్తుందని తెలిపాడు. ఒక లీటర్ ఇంధనం ధర కేవలం 10 నుండి 20 రుపాయల మధ్య ఉంటుంది.

కారు :
రయీస్ మార్కాని ఈ ఇంధన పని తీరు తెలుసుకోవడం కోసం ఒక పాత కారును రీ మోడలింగ్ చేసిన తరువాత ఈ ఇంధనంతో ప్రయోగించి తద్వారా ఇది ఎకో ఫ్రెండ్లి ఫ్యూయల్ అని తెలిపాడు.

అతని ఉద్ధేశం :
మార్కని మాట్లాడుతు ఈ ప్రయోగం పేటెంట్ పొందిన తరువాత పెట్టుబడిదారులు ఎవరైనా ముందుకు వస్తే తమ సొంత ఊరిలో ఈ ఇంధన తయారిని ప్రారంభిస్తానని తెలిపాడు.

మార్కని సందేశం :
ప్రస్తుతం వాహనదారులు అందరూ దాదాపుగా అత్యధికంగా లీటర్ పెట్రోల్ కు రూ. 70 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ అతి తక్కువ ధర గల ఇంధనం మార్కెట్లోకి వస్తే భారతీయ వాహనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

ఎకో ఫ్రెండ్లి :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లి కార్లకు మంచి గిరాకి పెరుగుతున్న తరుణంలో ఈ ఎకో ఫ్రెండ్లి ఇంధనం మంచి ఆదరణ పొందుతుందని హర్షం వ్యక్తం చేశాడు. మరి అతని కోరిక నిజమవ్వాలని ఆశిస్తూ, అతని ప్రయోగానికి జై కొడదాం...


Click it and Unblock the Notifications








