మహీంద్రా వారు అధికారికంగా ఆవిష్కరించిన కెయువి1OO
భారతీయ యస్‌యువి ప్రపంచంలోకి మహీంద్రా అండ్ మహీంద్రా మరొక యస్‌యువిని ప్రవేశ పెట్టింది. ఇది ప్రస్తుత యస్‌యువి మార్కెట్‌ను శాసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనిని డిజైన్, ఇంజన్, పవర్ , లభించు రంగులు ఒక్కటేమిటి అన్ని కొత్తవే. ఇటువంటి రూపాన్ని మొదటి సారిగా మహీంద్రా మోటార్స్ వారు పరిచయం చేశారు.
నూతన ఆవిష్కరణలకు మహీంద్రా తరువాతే మరెవరైనా అని మరో సారి నిరూపించారు. మరి ఈ మహీంద్రా కెయువి1OO గురించి మరిన్ని విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

విశేషాలు
నామకరణం: కెయువి1OO
కోడ్ పేరు : యస్101
మొదటి : యమ్ ఫాల్కన్ (Mfalcon)
ఇంధన: మొదటి సారిగా పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో లభిస్తోంది.

విడుదల
మహీంద్రా అండ్ మహీంద్రా వారు దీనిని జనవరి 15, 2016 న విడుదల చేయనున్నారు. అంటే సరిగ్గా 27 రోజులలో అన్నమాట.

ఇంజన్
మహీంద్రా వారు తరువాత యువత కోసం తయారు చేసిన ఈ సరికొత్త యస్‌యువి
కెయువి1OO లో ప్రపంచ స్థాయి రెండు ఇంజన్‌లను అందించారు. అవి,
- పెట్రోల్-యమ్ ఫాల్కన్ జి80 (mFALCON G80)
- డీజల్- యమ్ ఫాల్కన్ డి80 (mFALCON D80)
- ఫైరి ఆరెంజ్
- డాజ్లింగ్ సిల్వర్
- పియర్ల్ వైట్
- మిడ్‌నైట్ బ్లాక్
- ఫ్లాంబోయంట్ రెడ్
- అక్వామెరైన్
- డిజైనర్ గ్రే

పని తీరు
సరికొత్త మహీంద్రా కెయువి1OO లోని యయమ్ ఫాల్కన్ డి80 (mFALCON D80) డీజల్ ఇంజన్ దాదాపుగా 1198 సీసీ కెపాసిటి కలిగి ఉంది. మరియు ఇది అత్యధికంగా 77 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా వాహనం ప్రపంచంలోని యస్‌యువిలో మొదటి సారిగా డీజల్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో గల యమ్ ఫాల్కన్ జి80 (mFALCON G80) పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 1198 సీసీ కెపాసిటిని కలిగి ఉంది. ఇది 82 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లభించు రంగులు
ఈ సరికొత్త కెయువి1OO యస్‌యువి దాదాపుగా ఏడు విభిన్న రంగుల్లో లభించనుంది. అవి,

కెయువి అనగా
కెయువి అనగా కూల్ యుటిలిటి వెహికల్ అని దీని ఆవిష్కరణ సంధర్భంగా తెలిపారు.

బుకింగ్స్
మహీంద్రా కెయువి1OO కు చెందిన బుకింహగ్స్‌ను మహీంద్రా సంస్థ డిసెంబర్ 19, 2015 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వీటిని బుకింగ్స్ మహీంద్రా అధికారక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.

ధర
మహీంద్రా వారి సరికొత్త కెయువి1OO యస్‌యువి ధర దాదాపుగా నాలుగు నుండి ఆరు లక్షల మధ్య ఉండనుంది.



Click it and Unblock the Notifications








