నేలపై మరియు నీటిపై వెళ్లే హైబ్రిడ్ ఆటోరిక్షా
మీరు ఇప్పటి వరకూ రోడ్డుపై వెళ్లే ఆటోరిక్షాలను మాత్రమే చూసుంటారు. కానీ, ఎప్పుడైనా రోడ్డుపై, అలాగే నీటిపై కూడా వెళ్లే ఆటోరిక్షాలను చూశారా.. ఇదిగో ఇది అలాంటిదే. దీని పేరు సాలమండర్ (Salamander). ఫిలిప్పీన్స్‌కి చెందిన హె2ఓ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ హైబ్రిడ్ ఆంఫిబియస్ ట్రైసైకిల్‌ను తయారు చేసింది.
థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి వాహనాన్ని డిజైన్ చేశారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు సాలమండర్‌లో ఆరుగురు (డ్రైవరుతో కలిపి) సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అదే నీటిపై వెళ్లేటప్పుడైతే నలుగురు (డ్రైవరుతో కలిపి) మాత్రమే కూర్చోవటం సాధ్యమవుతుంది.

సాలమండర్ 5 కివా ఎలక్ట్రిక్ మోటార్‌తోను అలాగే 250సీసీ పెట్రోల్ ఇంజన్‌తోను పనిచేస్తుంది. ఇదొక హైబ్రిడ్ ఆటోరిక్షా. రోడ్డుపై ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తే, నీటిపై గంటకు 6 నాట్స్ వేగంతో వెళ్తుంది. లైట్‌వెయిట్ మాడ్యులర్ స్టీల్ ఫ్రేమ్, ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్స్‌తో దీని బాడీని డిజైన్ చేశారు.
ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ స్పీడోమీటర్ గేజ్, సోలార్ యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లు ఈ సాలమండర్ ట్రైసైకిల్ సొంతం. దీని ధర 6345 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు).


Click it and Unblock the Notifications








