ఏంటీ మాయ.. డ్రైవర్ లేకుండా 900 కిలోమీటర్లు వెళ్లిన కారు!

By Ravi

ఇప్పటికే అనేక కార్ కంపెనీలు డ్రైవర్ రహిత వాహనాలను అభివృద్ధి చేసే పనిలో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. తాజాగా.. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి కూడా ఈ తరహా కారును తయారు చేసి, విజయవంతంగా 560 మైళ్లు డ్రైవర్ సాయం లేకుండా నడిపి చూపింది.

లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2015 (సిఈఎస్ 2015)లో ఆడి తమ పైలెటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. ఇందు కోసం కంపెనీ తమ పాపులర్ ఆడి ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్ కారును ఉపయోగించింది.

ఈ మోడల్‌ను డ్రైవర్ రహిత కారుగా మార్చి, కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ నుంచి సిఈఎస్ 2015 జరుగుతున్న లాస్ ఏంజిల్స్ వరకూ డ్రైవర్ లేకుండా నడిపి శభాష్ అనిపించుకుంది. ఈ కారు ట్రాఫిక్, ఇతర ఇక్కట్లను అధిగమించి 560 మైళ్లు ప్రయాణించింది.

Audi A7 Sportback Piloted Drive

ఈ డ్రైవర్ రహిత ప్రయాణ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించేందుకు గాను కొందరు ఎంపిక చేసిన మీడియా మిత్రులకు ఆడి అవకాశం కల్పించింది. ఈ 560 మైళ్ల ప్రయాణంలో సేకరించిన డేటాను ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో మరింత సురక్షితమైన డ్రైవర్ రహిత వాహనాలను ఆడి అభివృద్ధి చేయనుంది.

ఈ స్పెషల్ డ్రైవ్ కోసం ఆడి కాలిఫోర్నియా చట్టలా ప్రకారం ప్రత్యేక అనుమతి తీసుకుంది. ముందస్తు జాగ్రత్త కోసం ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో ఓ ఆడి టెస్ట్ డ్రైవర్‌ను కూడా కూర్చోబెట్టారు. 0 నుంచి 110 కిలోమీటర్ల వేగం వరకూ ఈ ఆడి పైలెటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ కారు తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు సాగిపోగలదు.

చుట్టు ప్రక్కల పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూ, యాక్సిలరేషన్ మరియు బ్రేకింగ్‌లను ఈ కారే స్వయంగా చేసుకుంటుంది. ఈ సిస్టమ్‌కు జర్మన్ ఇంజనీర్లు 'జాక్' అని నామకరణం చేశారు. ఇందుకోసం వారు పలు కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆడి సైట్ అసిస్ట్, నాలుగు చిన్న కెమెరాలు, ఓ 3డి వీడియో కెమెరా, రాడార్లు, లేజర్లు, జిపిఎస్‌లను కూడా ఉపయోగించి ఈ డ్రైవర్ రహిత ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 7, 2015, 14:13 [IST]
English summary
The 2015 International Consumer Electronics Show of 2015 is underway. German luxury automobile manufacturer Audi is also present at the show with their piloted driving concept vehicle. Audi will also show other automotive innovations during CES 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+