ఎమిషన్ పరీక్షలను మోసం చేసిన ఆడి: 2 మిలియన్ కార్ల మీద దీని ప్రభావం
ఆడి కంపెనీ తమ కార్లకు జరిపే ఎమిషన్ పరీక్షలను మోసం చేసింది. దీని ప్రభావం దాదాపుగా రెండు మిలియన్ కార్ల మీద పడింది. ఒక అనధికారక సాఫ్ట్‌వేర్‌ను వాడిన వోక్స్‌వ్యాగన్ లాగే జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ వాహనాలలో ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను వాడింది. వోక్స్‌వ్యాగన్ చేసిన తప్పునే ఆడి కూడా చేసింది.
ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను వాడిన దాదాపు 1.42 మిలియన్ కార్లను యూరప్‌లో అమ్మారు. ఆడి శ్రేణిలో గల ఏ1, ఏ3, ఏ4, ఏ5, ఏ6, టీటీ, క్యూ3 మరియు క్యూ5 వంటి ఎనిమిది మోడళ్ల యందు ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన వార్తలు వెలువడిన తరువాత వోక్స్‌వ్యాగన్ మాజి సి.ఇ.ఒ మార్టిన్ వింటర్ కార్న్‌ను విచారించినట్లు తెలుస్తోంది.

అయితే ఇతర కార్ల తయారీదారులైన ప్రముఖ కంపెనీలు బి.ఎమ్.డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈ కుంభకోణానికి చాలా దూరంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కార్లు మానవ అవసరాలకు ఎంతో చక్కగా ఉపయోగపడుతున్నాయి. కాని ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను వాడిన తరువాత ఇలాంటి కార్లు పర్యావరణాని ఎంతో హాని కలిగిస్తున్నాయి.

పోర్చ్సే, బెంట్లీ మరియు ల్యాంబోర్గిని- వోక్స్‌వ్యాగన్‌కు చెందిన సొంత బ్రాండ్లే అయినప్పటికి అవి ఎలాంటి మోసం చేయలేదు అంతేకాకుండా అవి విడిగా తమ బ్రాండ్లకు ఉద్గార పరీక్షలను జరిపించుకున్నాయి.మొత్తం 2.1 మిలియన్ ఆడి మోడల్ కార్లు ఒక అనధికారక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ ఉద్గార పరీక్షలను మోసం చేసింది.
కాబట్టి కేవలం రెండు కార్ల తయారి కంపెనీలు అయిన వోక్స్‌వ్యాగన్ మరియు ఆడి లు ఎమిషన్ పరీక్షలను మోసం చేశాయి.



Click it and Unblock the Notifications








