గుజరాత్‌లో నాలుగవ షోరూమ్‌ను ప్రారంభించిన "ఆడి"
జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గుజరాత్‌లో మరొక షోరూమ్‌ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో మూడు షోరూమ్‌లు కలవు, వడోదల, సూరత్ మరియు అహ్మదాబాద్ వంటి ప్రదేశాల్లో కలవు. అయితే ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ప్రారంభించిన షోరూమ్ నాలుగవది.
Also Read: టాటా జికా కారు క్విడ్ మరియు ఆల్టోలను అంతం చేయగలదా? మూడు కార్ల స్పష్టమైన పోలికలు...
ఒక లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల ఈ షోరుమ్‌ను ఆడి ఇండియా హెడ్ అయిన జోయ్ కింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీని పేరు నిక్సినొవా మోటోరిన్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలిపారు. దీని రాజ్‌కోట్ లో ఎన్‌హెచ్ 8బి కి దగ్గరలో నెలకొల్పినట్లు తెలిపారు.
Also Read: పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అస్సలు మర్మం ఎమిటి
ఈ సందర్భంగా జోయ్ కింగ్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో లగ్జరీ కార్ల వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిందని, అంతే కాకుండా గుజరాత్‌లోని ఆడి కార్ల వినియోగదారుల సంఖ్య బాగా పెరగడం వలన రాజ్‌కోట్‌లో మరొక ఆడి షోరూమ్ ఏర్పాటుకు కారణం అయ్యిందని తెలిపారు. తద్వారా ఆడి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మార్గం మరింత సుగమం అయ్యిందని తెలిపారు.





Click it and Unblock the Notifications