పవర్‌ఫుల్ ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్ విడుదల; ధర రూ.2.97 కోట్లు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి, గడచిన సంవత్సరంలో మే నెలలో గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన 'ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్' (Audi R8 LMX)ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారులో మరో విశిష్టత ఏంటంటే.. ఇందులో లేజర్ హెడ్‌లైట్లను ఉపయోగించారు. ఇది ప్రపంచంలో కెల్లా లేజర్ హెడ్‌లైట్లు కలిగిన మొట్టమొదటి ప్రొడక్షన్ కారు.
భారత మార్కెట్లో ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్ ధర రూ.2.97 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారులో పవర్‌ఫుల్ 5.2 లీటర్, వి10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఆడి ఆర్8 వి10 ప్లస్ వేరియంట్‌లోను ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కాకపోతే.. ఆర్8 ఎల్ఎమ్ఎక్స్‌లో ఉపయోగించిన ఇంజన్ ఆర్8 వి10 ప్లస్ వేరియంట్ కన్నా 20 బిహెచ్‌పిల శక్తిని (మొత్తం 570 హెచ్‌పిలు) ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది, ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్). ఈ సూపర్‌కారు కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్ గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు.





Click it and Unblock the Notifications








